🦅 *EAGLE*
*Community paramedics & Primary Health care providers ఆధ్వర్యం లో మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు మరియు ర్యాలీ*
*రాజమండ్రి-తూర్పుగోదావరి జిల్లా*
*ప్రధానమంత్రి గారి వికసిత భారత్ కార్యక్రమం లో భాగంగా* ఈరోజు రాజమండ్రి, రాజానగరం లో ఉన్న గ్రీన్ వాలీ కన్వెన్షన్ నందు మాదకద్రవ్యాల పై Community paramedics & Primary Health care providers & EAGLE ఆధ్వర్యం లో అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది.
✅ ఈ కార్యక్రమంలో 50 మంది RMP లు మరియు మెడికల్ shops వారు పాల్గొన్నారు. వారికి Operation గరుడ, recent గా జరిగిన జంగారెడ్డిగూడెం case study, *BREAK THE SILENCE-CALL 1972* మరియు Eagle works గురించి వివరించడం జరిగింది.
✅ అదేవిధంగా, మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబం మరియు సమాజంపై కలిగే దుష్ప్రభావాలను వివరించి, భవిష్యత్తులో ఇటువంటి నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు.
✅ గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడినవి తెలపడమైనది.
ఈ కార్యక్రమం లో
1) *డా.సి హెచ్. శివ భరత్* ఎం. ఎస్., ఎం సి హెచ్., సర్జికల్ ఆంకాలజీ.,
2) *డా. పృథ్వి* . ఎం బి బి ఎస్., ఎం డి.,రేడియేషన్ ఆంకాలజీ.,
3) *Mr.అంజిబాబు* సెంటర్ హెడ్., కాకినాడ *మెడికోవర్ హాస్పిటల్*
4)*రాజానగరం సీఐ గారు* మరియు ఈగల్ సిబ్బంది పాల్గొన్నారు