EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Sri Potti Sriramulu Nellore - Nellore Town SDPO - Dargamitta UPS
Awareness
OFFICIAL

Sri Potti Sriramulu Nellore - Nellore Town SDPO - Dargamitta UPS

Conducted: 26 October, 2026 Sri Potti Sriramulu Nellore Venue: DPO, NELLORE EAGLE 800 Attendees
మౌనాన్ని వీడండి – ఈగల్ 1972కు సమాచారం ఇవ్వండి
తేదీ: 26.10.2026
SPSR నెల్లూరు ఈగల్ సెల్
డ్రగ్స్ అవేర్‌నెస్ కార్యక్రమం – ఓపెన్ హౌస్
గౌరవనీయులైన శ్రీ A.K. రవి కృష్ణ, IPS, IGP గారు, శ్రీ K.M. మహేశ్వర రాజు, IPS, SP (Ops) గారు మరియు శ్రీమతి G. స్వరూప రాణి, SP (Admin) మేడమ్ వారి ఆదేశాల మేరకు, 26.10.2026వ తేదీన నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో SPSR నెల్లూరు ఈగల్ సెల్ పాల్గొని విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, డ్రగ్ డిటెక్షన్ కిట్ల వినియోగం, మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరి బాధ్యత గురించి వివరించడం జరిగింది.
కార్యక్రమ వివరాలు:
1. సబ్ డివిజన్: నెల్లూరు టౌన్
2. పోలీస్ స్టేషన్: దర్గామిట్ట పోలీస్ స్టేషన్
3. వేదిక: జిల్లా పోలీసు కార్యాలయం, నెల్లూరు
4. పాల్గొన్నవారు: 10 పాఠశాలలకు చెందిన 800 మంది విద్యార్థులు
కార్యక్రమంలో వివరించిన ముఖ్య అంశాలు:
- విద్యార్థులు తమ పాఠశాలల్లో, గ్రామాల్లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను వినియోగించడం, విక్రయించడం, కొనుగోలు చేయడం లేదా రవాణా చేయడం గమనించినా, అటువంటి సమాచారం తెలిసినా మౌనంగా ఉండకుండా “BREAK THE SILENCE” నినాదంతో ముందుకు రావాలని సూచించడం జరిగింది.
- మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు తెలియజేయాలని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.
- మత్తు పదార్థాలపై సమాచారం అందించడం ద్వారా ఒక వ్యక్తి జీవితాన్ని, ఒక కుటుంబాన్ని కాపాడే అవకాశం ఉంటుందని వివరించడం జరిగింది.
- మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులకు డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స మరియు పునరావాస సేవలు అందుబాటులో ఉన్నాయని తెలియజేయడం జరిగింది.
- సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది.
- ఈగల్ వార్షిక నివేదిక – 2025 గురించి వివరించడంతో పాటు, NDPS చట్టంలోని నిబంధనలు, మత్తు పదార్థాలకు సంబంధించిన నేరాల్లో చిక్కుకుంటే భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలు మరియు చట్టపరమైన పరిణామాల గురించి అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులందరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఇతరులను కూడా మత్తు పదార్థాల బారిన పడకుండా చైతన్యపరచాలని, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది.
🚫 మత్తు పదార్థాలకు నో చెప్పండి!
🦅 ఈగల్ టోల్ ఫ్రీ నంబర్: 1972
మౌనాన్ని వీడండి – మీ సమాచారం ఒకరి జీవితాన్ని కాపాడవచ్చు!
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.