మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం & ప్రత్యేక సైకిల్ ర్యాలీ నివేదిక
🗓️ తేదీ: 26-10-2026
📍 జిల్లా: NTR
👮♂️ సెంట్రల్ డివిజన్
🏛️ పోలీస్ స్టేషన్ పరిధి: మాచవరం
🏫 వేదిక: P. B Siddhartha college of arts and science.
👥 హాజరైన వారి సంఖ్య: సుమారు 150 మంది విద్యార్థులు & సిబ్బంది
🚴♀️ కార్యక్రమ వివరాలు:
మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మరియు కృష్ణా జిల్లా EAGLE టీమ్ సంయుక్త ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి ఢిల్లీ వరకు సుమారు 3,000 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపడుతున్న శ్రీమతి ఇందుకూరి విజయలక్ష్మి (62 సంవత్సరాలు) గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
📢 అవగాహనా అంశాలు:
EAGLE టీమ్ ఆధ్వర్యంలో అమలవుతున్న పటిష్టమైన ఆపరేషన్ల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించడమైనది:
🛡️ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ (Safe Campus Zone)
🔱 ఆపరేషన్ త్రిశూల్ (Operation Trishul)
🦅 ఆపరేషన్ గరుడ (Operation Garuda)
🚆 ఆపరేషన్ ట్రైన్ చెకింగ్ (Train Checking)
⚡ ఆపరేషన్ వజ్రప్రహార్ (Vajra Prahar)
🔹 చట్టాలు & కఠిన శిక్షలు:
🚫 "BREAK THE SILENCE" కాన్సెప్ట్ మరియు డ్రగ్స్ సేవించే వారికి నిర్వహించే నిర్ధారణ పరీక్షల (Drug Tests) విధానాన్ని తెలిపారు.
⚖️ NDPS చట్టం ప్రకారం మాదకద్రవ్యాల విక్రయం, రవాణా మరియు వినియోగంపై విధించే కఠినమైన జైలు శిక్షల గురించి స్పష్టం చేశారు.
📞 డ్రగ్స్ సమాచారం అందించడానికి EAGLE టోల్ ఫ్రీ నంబర్: 1972 ను ఉపయోగించుకోవాలని సూచించారు.
🎯 ఈ కార్యక్రమంలో విజయవాడ ఈగల్ టీం RSI, R. Sreerama Murthy, PC. S. Krishna మరియు శ్రీమతి ఇందుకూరి. విజయలక్ష్మి & జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, DSDO కోటేశ్వరరావు పాల్గొనడం జరిగినది.