EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Kakinada - Peddapuram SDPO - Peddapuram
Awareness
OFFICIAL

Kakinada - Peddapuram SDPO - Peddapuram

Conducted: 25 October, 2026 Kakinada Venue: వాలు తిమ్మాపురం TIDCO అపార్ట్‌మెంట్స్, పెద్దాపురం EAGLE 100 Attendees
🦅 EAGLE – KAKINADA DISTRICT
తేదీ: 25-10-2026
Sub-Division: పెద్దాపురం సబ్ డివిజన్
Police Station: పెద్దాపురం పోలీస్ స్టేషన్
స్థలం: వాలు తిమ్మాపురం TIDCO అపార్ట్‌మెంట్స్, పెద్దాపురం
Participants: 100 మంది
పల్లెబాటలో ఈగల్ – రచ్చబండ ద్వారా ప్రజలతో ముఖాముఖి – BREAK THE SILENCE కార్యక్రమాన్ని ఈ రోజు పెద్దాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వాలు తిమ్మాపురం TIDCO అపార్ట్‌మెంట్స్‌లో నిర్వహించారు.
గౌరవ ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ, IPS గారు, ఎస్పీ (Ops) శ్రీ కె.ఎం. మహేశ్వరరాజు, IPS గారు మరియు ఎస్పీ (Admin) శ్రీమతి డి. స్వరూపరాణి గారి ఆదేశాల మేరకు, ఈగల్ సెల్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
✅ ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్లలోని ప్రజలకు EAGLE విభాగం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించి, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
✅ NDPS Act-1985 ప్రకారం మాదకద్రవ్యాల నేరాలకు పాల్పడిన వారిపై తీసుకునే చట్టపరమైన చర్యలు, శిక్షల గురించి వివరించారు.
✅ డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును, కుటుంబాలను, సమాజాన్ని ఏ విధంగా దెబ్బతీస్తుందో వివరించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
✅ BREAK THE SILENCE – డ్రగ్స్ గురించి మౌనం వద్దు, సమాచారం ఇవ్వడం మన బాధ్యత అనే సందేశంతో, గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

✅ ప్రజలకు సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించి, డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించి, “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో అవగాహన కల్పించారు.

✅ ఈ కార్యక్రమంలో పెద్దాపురం సీఐ గారు, ఎస్‌ఐ గారు, EAGLE సిబ్బంది మరియు అపార్ట్‌మెంట్ నివాసితులు పాల్గొన్నారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.