EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Prakasam - Ongole SDPO - Naguluppalapadu (N.G. Padu)
Awareness
OFFICIAL

Prakasam - Ongole SDPO - Naguluppalapadu (N.G. Padu)

Conducted: 24 October, 2026 Prakasam Venue: Zilla Parishad High School, Uppugunduru Village EAGLE 110 Attendees
🦅 ఏపీ ఈగల్ | ప్రకాశం జిల్లా
🚨 110 మంది విద్యార్థులకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా ఈగల్ సెల్
📍 వేదిక: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉప్పుగుండూరు గ్రామం
👮 పోలీస్ స్టేషన్: నాగులుప్పలపాడు | సబ్ డివిజన్: ఒంగోలు
📅 తేదీ: 24-10-2026
ప్రకాశం జిల్లా ఈగల్ సెల్ ఆధ్వర్యంలో నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పుగుండూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 110 మంది విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, అక్రమ రవాణా మరియు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
🎯 కార్యక్రమంలోని ముఖ్య అంశాలు
🔹 నార్కో టెర్రరిజం: మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సమకూరే నిధులు ఉగ్రవాద కార్యకలాపాలకు ఎలా ఉపయోగపడవచ్చో వివరించారు.
🔹 ఆరోగ్యం – విద్యపై ప్రభావం: డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు, చదువుపై ఏకాగ్రత తగ్గడం, కుటుంబ సంబంధాలు దెబ్బతినడం, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాల గురించి వివరించారు.
🔹 NDPS చట్టం–1985: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, నిల్వ, అక్రమ స్వాధీనానికి సంబంధించిన చట్టపరమైన నిబంధనలు, పరిణామాలపై అవగాహన కల్పించారు.
🔹 స్నేహితుల ఒత్తిడి – వ్యసనం: సరదా, ఆసక్తి లేదా స్నేహితుల ఒత్తిడితో డ్రగ్స్ ప్రయోగించే ప్రమాదాల గురించి హెచ్చరించారు.
🔹 చట్టపరమైన పరిణామాలు: డ్రగ్స్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే కేసులు, అరెస్టు, జైలు శిక్ష, జరిమానాలు ఎదురయ్యే అవకాశాల గురించి తెలియజేశారు.
🔹 ఆరోగ్యకరమైన భవిష్యత్తు: విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, విద్య, క్రీడలు, ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
📞 ఈగల్ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్: 1972
మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా లేదా అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే 1972కు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.
🦅 బ్రేక్ ది సైలెన్స్ – కాల్ 1972
డ్రగ్స్ వద్దు బ్రో – డ్రగ్స్‌కు నో చెప్పండి!
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.