EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Guntur - Thulluru SDPO - Tadikonda
Awareness
OFFICIAL

Guntur - Thulluru SDPO - Tadikonda

Conducted: 03 October, 2026 Guntur Venue: రావెల ZPH School EAGLE 145 Attendees
🦅గుంటూరు ఈగల్ సెల్🦅

🔰గుంటూరు ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో రావెల ZPHS లో 'డ్రగ్స్ వద్దు బ్రో' అవగాహన సదస్సు.

▪️తాడికొండ (రావెల):
గుంటూరు జిల్లా, తాడికొండ మండలం, రావెల గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ (ZPHS) నందు ఈరోజు మధ్యాహ్నం 3:00 గంటలకు గుంటూరు ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు 'డ్రగ్స్ వద్దు బ్రో' అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

▪️ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు ఈగల్ ఎస్సై శ్రీ ఎమ్. సునీల్ బాబు గారు హాజరై, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు సమగ్రంగా అవగాహన కల్పించారు.

🔰ఈ సందర్భంగా ఎస్సై ఎమ్. సునీల్ బాబు గారు మాట్లాడుతూ:

🔸'బ్రేక్ ద సైలెన్స్' – టోల్ ఫ్రీ నంబర్ 1972: ఏపీ ఈగల్ చీఫ్, ఐజిపి శ్రీ ఆర్.కె. రవికృష్ణ ఐపీఎస్ గారు ప్రవేశపెట్టిన 'బ్రేక్ ద సైలెన్స్' కార్యక్రమాన్ని వివరిస్తూ... ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ సమాచారం ఉంటే భయపడకుండా, మౌనం వీడి ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

🔸పొగాకు, మద్యం నుంచే డ్రగ్స్ బానిసత్వం: మాదకద్రవ్యాలకు బానిసలయ్యే వారు మొదటగా పొగాకు ఉత్పత్తులకు, ఆ తర్వాత మద్యానికి అలవాటు పడి క్రమేణా డ్రగ్స్ వైపు అడుగులు వేస్తారని తెలిపారు. వివిధ కేసుల్లో పట్టుబడిన యువకులు, విద్యార్థులలో ఎక్కువ మంది పొగాకు, మద్యానికి అలవాటు పడిన వారేనని పేర్కొన్నారు.

🔸ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్: విద్యార్థుల భద్రతే లక్ష్యంగా ఏపీ ఈగల్ 'ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్' నిర్వహిస్తోందని చెప్పారు. పాఠశాలలు, విద్యాసంస్థల పరిసరాల్లో 500 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులు విక్రయించే షాపులపై తనిఖీలు చేసి, కొట్పా (COTPA) చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి పదేపదే అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

🔸పుస్తకమే ఆయుధం కావాలి: విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, ప్రతి అడుగు ఆచితూచి వేయాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, చదువుపై దృష్టి సారించి, పుస్తకాన్ని ఆయుధంగా మలుచుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

🔰ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎమ్ శ్రీమతి జె. అంజలి దేవి గారు, ఈగల్ సిబ్బంది, మహిళా పోలీస్ అనురాధ, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Break the Silence ⛓️‍💥 Call Eagle 1972
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.