అనంతపురం రూరల్‌లో ‘పల్లె బాటలో ఈగల్’ – మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం
అనంతపురం రూరల్ మండలం, ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లి ప్రాంతంలో 03-10-2026న ఉపాధిహామీ పథకం కింద పనిచేస్తున్న శ్రామికులకు ‘పల్లె బాటలో ఈగల్’ మరియు ‘BREAK THE SILENCE – CALL 1972’ కార్యక్రమాల ద్వారా మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972కు గోప్యంగా సమాచారం అందించాలని సూచిస్తూ, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.