ASR DISTRICT,
రింతాడా గ్రామం,
జి. కె.వీధి పి. యస్,
చింతపల్లి సబ్ డివిజన్.
BREAK the SILENCE call 1972
పల్లె బాటలో ఈగల్ కార్యక్రమంలో భాగంగా, ఈగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ రోజు జి. కే. వీధి పి యస్ లిమిట్స్ రింతాడా గ్రామ పంచాయతీ పరిధి లో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు వాటి బారిన పడకుండా ఉండాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించడం జరిగింది.
అలాగే, మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన EAGLE టోల్ ఫ్రీ నంబర్ – 1972 గురించి,మరియు ఈగల్ ఇంపాక్ట్ ఆపరేషన్స్- ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, వజ్ర ప్రహర్, ఆపరేషన్ ట్రైన్స్, ఆపరేషన్ గరుడ మరియు BREAK THE SILENCE CALL 1972 గూర్చివివరించడం జరిగింది.
పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనిస్తూ, వారిని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడిపేలా తల్లిదండ్రులు మరియు సంరక్షకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించాము.