EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Krishna - Gannavaram SDPO - Gannavaram UPS
Awareness
OFFICIAL

Krishna - Gannavaram SDPO - Gannavaram UPS

Conducted: 03 October, 2026 Krishna Venue: Freedom Rehabilitation Centre EAGLE 20 Attendees

📍 స్థలం: శ్రీ నగర్ కాలనీ, గన్నవరం, కృష్ణా జిల్లా.
గౌరవ ఈగల్ IGP శ్రీ ఆకే రవికృష్ణ IPS, శ్రీ K. M. మహేశ్వరరాజు IPS, శ్రీమతి G.స్వరూపరాణి SP, శ్రీ ch. శ్రీనివాసరావు Addl. SP, EAGLE గారి ఆదేశాల మేరకు,
🍁 కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని Freedom Rehabilitation Centre ను ఈగల్ అధికారులు Sri .M. రవీంద్ర గారు సందర్శించారు.
ముఖ్యాంశాలు:
🍁 వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలకు బానిసైన యువతకు చికిత్స, కౌన్సెలింగ్ మరియు పునరావాసం ఎంతో ముఖ్యమని తెలిపారు.
🍁 మాదక ద్రవ్యాల సరఫరా వ్యవస్థను అడ్డుకోవడం ద్వారా వ్యసనాన్ని నియంత్రించవచ్చని, డ్రగ్స్ సరఫరా లింకులను గుర్తించి వాటిని ఛేదించేందుకు ఈగల్ విభాగం ప్రత్యేక దృష్టితో పనిచేస్తోందని పేర్కొన్నారు.
🍁 చికిత్స అనంతరం బయటకు వెళ్లిన వారు తిరిగి పాత స్నేహితుల ప్రభావానికి లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
🍁 ఎవరైనా మళ్లీ డ్రగ్స్ వినియోగానికి ప్రేరేపించినా వెంటనే వారికి దూరంగా ఉండాలని, తమ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు.
🍁 ఎక్కడైనా మాదక ద్రవ్యాల విక్రయం, సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు.
⚖️ NDPS చట్టంపై అవగాహన
🍁 మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, కొనుగోలు, నిల్వ మరియు వినియోగానికి సంబంధించిన నేరాలపై NDPS Actలో కఠినమైన నిబంధనలు ఉన్నాయని అధికారులు వివరించారు.
🍁 నేరం స్వభావం, మాదక ద్రవ్యం రకం మరియు పరిమాణాన్ని బట్టి చట్టపరమైన చర్యలు, జరిమానా మరియు జైలు శిక్షలు విధించే అవకాశం ఉంటుందని తెలిపారు.
🍁 అక్రమంగా సంపాదించిన ఆస్తులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని వివరించారు.
🍁 డ్రగ్స్ కారణంగా జీవితాన్ని, కుటుంబాన్ని మరియు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, వ్యసనం నుంచి బయటపడేందుకు చికిత్స, కౌన్సెలింగ్ మరియు పునరావాస సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
👨‍⚕️ డాక్టర్ హరీష్ చంద్ర గారి సందేశం
🍁 డాక్టర్ హరీష్ చంద్ర గారు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల సమస్య సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు.
🍁 డ్రగ్స్ సరఫరా వ్యవస్థను అడ్డుకోవడంతో పాటు వ్యసనానికి గురైన వారికి సరైన వైద్యం, కౌన్సెలింగ్ మరియు పునరావాసం అందించడం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు.
🍁 ప్రభుత్వ ఆరోగ్య విభాగం, ఈగల్ మరియు పునరావాస సంస్థలు సమన్వయంతో పనిచేస్తే డ్రగ్స్ ప్రభావాన్ని తగ్గించి సమాజాన్ని మరింత సురక్షితంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు.
👥 కార్యక్రమంలో పాల్గొన్నవారు
🍁 ఈగల్ ఇన్స్పెక్టర్
🍁 డాక్టర్ హరీష్ చంద్ర గారు
🍁 Pcs K.Murali mohan గారు
🍁 అరుణ్ గారు
🍁 రీహబి లేషన్ సెంటర్ యాజమాన్యం మరియు సిబ్బంది పాల్గొనడం జరిగినది
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.