నెల్లూరు జిల్లా – EAGLE సెల్
📅 తేదీ: 19-10-2026
📍 జిల్లా: నెల్లూరు
🏢 సబ్ డివిజన్: నెల్లూరు
👮 పోలీస్ స్టేషన్: నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి
📌 కార్యక్రమ స్థలం: మోడల్ డెయిరీ – మైగ్రెంట్ వర్కర్స్
👥 హాజరైన వారు: 180 మంది
📢 BREAK THE SILENCE – CALL EAGLE 1972
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, నెల్లూరు జిల్లా EAGLE సెల్ ఆధ్వర్యంలో “Break the Silence” కార్యక్రమంలో భాగంగా, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోడల్ డెయిరీలో పనిచేస్తున్న వలస కార్మికులు మరియు సిబ్బందికి మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ మరియు సామాజిక దుష్పరిణామాల గురించి వివరించి, ఎవరూ మత్తు పదార్థాలకు బానిసలై తమ విలువైన జీవితాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించడం జరిగింది.⚖️ NDPS చట్టం – నేరాలు మరియు శిక్షలు: మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలు, NDPS చట్టం కింద విధించే శిక్షల గురించి అవగాహన కల్పించడం జరిగింది.📞 EAGLE టోల్‌ఫ్రీ నంబర్ – 1972: గంజాయి, డ్రగ్స్ లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే వెంటనే EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972 కు తెలియజేయాలని సూచించడం జరిగింది.🔒 సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేస్తూ, మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది. “మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి – మత్తురహిత నెల్లూరు జిల్లా నిర్మాణానికి సహకరించండి!”BREAK THE SILENCE – CALL EAGLE 1972