పాలకొండలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ – విద్యార్థులకు ఈగల్ అవగాహన కార్యక్రమం
పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యసాయి డిగ్రీ కళాశాలలో 03-10-2026న PVP Manyam EAGLE Cell ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు Operation Chaitanya, Operation Garuda, Operation Safe Campus Zone, Joint Train Operations మరియు EAGLE కార్యకలాపాల గురించి వివరించారు.
గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. BREAK THE SILENCE – CALL 1972 ద్వారా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని EAGLEకు అందించాలని, సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు. అలాగే NDPS చట్టాలు, సైబర్ క్రైమ్ తదితర అంశాలపై అవగాహన కల్పించి, చివరగా విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదం చేయించారు.