EAGLE CELL – Dr. B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా
విషయం: Neighbourhood Youth Parliament -2026-27 under the theme NASA MUKT YUVA* కార్యక్రమం లో “BREAK THE SILENCE” అవగాహన కార్యక్రమం నిర్వహణ – నివేదిక.
తేదీ: 17-10-2026
సబ్ డివిజన్: అమలాపురం
మండలం: అల్లవరం
పోలీస్ స్టేషన్: అల్లవరం PS
గ్రామం: ఓడలరేవు
స్థలం: BVC ఇంజనీరింగ్ కాలేజ్
Participated numbers:150
గౌరవనీయులైన ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ, IPS గారు, శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS, SP గారు మరియు శ్రీమతి D. స్వరూప రాణి, SP, EAGLE గారి ఆదేశాల మేరకు, EAGLE CELL, Dr. B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆధ్వర్యంలో అమలాపురం BVC ఇంజనీరింగ్ కాలేజీలో “BREAK THE SILENCE” (మౌనం వీడండి) అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
🗣️ BREAK THE SILENCE – మౌనం వీడండి
ఈ కార్యక్రమంలోమాదకద్రవ్యాల EAGLE
I/c CI వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు మౌనంగా ఉండకుండా, బాధ్యతగల పౌరులుగా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే, యువతలో ఎవరైనా మాదకద్రవ్యాల వ్యసనానికి గురవుతున్నట్లు గమనిస్తే వారిని నిర్లక్ష్యం చేయకుండా, సకాలంలో కౌన్సెలింగ్, వైద్య సహాయం మరియు సరైన మార్గదర్శకత్వం అందేలా సహకరించాలని పిలుపునిచ్చారు.
🛡️ EAGLE ప్రత్యేక కార్యక్రమాలు
రాష్ట్రవ్యాప్తంగా EAGLE విభాగం చేపడుతున్న చైతన్యం, గరుడ, సేఫ్ క్యాంపస్ జోన్, జాయింట్ ట్రైన్ ఆపరేషన్స్, వజ్రప్రహార్ తదితర కార్యక్రమాల గురించి వివరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం, యువతలో చైతన్యం మరియు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములై వికసిత భారత్ లక్ష్య సాధనకు తమ వంతు కృషి చేయాలని సందేశాన్ని అందించారు.
📞 EAGLE టోల్ ఫ్రీ నంబర్ – 1972
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972 కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు.
👥 కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో EAGLE CI శ్రీ వెంకటేశ్వరరావు గారు మరియు సిబ్బంది, నషా ముక్తి యువ కోఆర్డినేటర్స్ , BVC ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.