విగ్నాన్ యూనివర్సిటీ, వడ్లమూడి, గుంటూరు జిల్లాలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఈగల్ చీఫ్ శ్రీ ఆకె రవికృష్ణ, ఐపీఎస్
వడ్లమూడి, గుంటూరు జిల్లా | 16-10-2026
గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విగ్నాన్ యూనివర్సిటీలో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి ఏపీ ఈగల్ చీఫ్ శ్రీ ఆకె రవికృష్ణ, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ ఆకె రవికృష్ణ గారు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వ్యసనం వల్ల కలిగే ఆరోగ్యపరమైన దుష్పరిణామాలు, వ్యక్తిగత జీవితం, విద్యాభ్యాసం మరియు భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలను విద్యార్థులకు విపులంగా వివరించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయడమే కాకుండా, వారి ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకంగా మారుతుందని తెలిపారు.
విద్యార్థులు మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటికి ఆకర్షితులు కాకుండా తమ లక్ష్యాలపై దృష్టి సారించాలని సూచించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడంలో యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం, ఏపీ ఈగల్ విభాగం నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, మాదకద్రవ్యాల నివారణలో ప్రజల భాగస్వామ్యం యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ఎక్కడైనా గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1972 కు సమాచారం అందించాలని కోరారు.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి – ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోండి.