EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › NTR Commissionerate - DCP LO-2 - Vijayawada I Town
Awareness
OFFICIAL

NTR Commissionerate - DCP LO-2 - Vijayawada I Town

Conducted: 15 October, 2026 NTR Commissionerate Venue: APSRTC ప్రాంగణం EAGLE 500 Attendees
రాష్ట్రీయ ఏక్తా దివస్–2026ను సందర్భంగా మాదక ద్రవ్యాల నిర్మూలన జాతీయ మోటార్ సైకిల్ భారి అవగాహన ర్యాలి

విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా | 15-10-2026

🔰 రాష్ట్రీయ ఏక్తా దివస్–2026ను పురస్కరించుకొని మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాతీయ మోటార్ సైకిల్ అవగాహన ర్యాలీని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో ఈగల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. రవీంద్ర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

🔰ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగరం నుండి గుజరాత్ రాష్ట్రంలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు సుమారు 1,500 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా యువతకు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించనున్నారు.

🔰ఈ ర్యాలీలో 8 మంది మోటార్ సైకిల్ యాత్రికులు పాల్గొంటుండగా, 11వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్, నోడల్ ఆఫీసర్ శ్రీ PND ప్రసాద్ గారు యాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. యాత్రలో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని సందేశాన్ని అందించనున్నారు.

🔰ఈ సందర్భంగా ఈగల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. రవీంద్ర గారు మాట్లాడుతూ,:

మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వాటికి దూరంగా ఉండటంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. విజయవాడ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర దేశవ్యాప్తంగా యువతలో చైతన్యం తీసుకురావడంతో పాటు, మాదక ద్రవ్య రహిత భారతదేశ నిర్మాణానికి దోహదపడుతుందని ఆకాంక్షించారు.

🔰 నోడల్ ఆఫీసర్ శ్రీ PND ప్రసాద్ గారు మాట్లాడుతూ,:

సుమారు 1,500 కిలోమీటర్ల మేర సాగే ఈ మోటార్ సైకిల్ యాత్ర ప్రధాన ఉద్దేశం యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం, వాటి దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించడం అని పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

🔰 పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో అవగాహన కార్యక్రమం:

యాత్ర ప్రారంభానికి ముందు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద యాత్ర బృందానికి స్వాగతం పలికారు. అక్కడి డార్మిటరీలో ఉన్నవారికి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించి, వాటికి దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు.

🔰**Break the Silence
మౌనంగా ఉండకండి:**

గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల అక్రమ సరఫరా, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1972కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.