శ్రీకాకుళం ఈగల్ సెల్,
పల్లెబాట లో ఈగల్
టెక్కలి సబ్ డివిజన్
కోటబొమ్మాళి పి.యస్
40 మంది మహిళలు
పల్లె బాటలో ఈగల్ కార్యక్రమంలో భాగంగా, ఈగల్ సెల్ ఆధ్వర్యంలో కోటబొమ్మాళి పి.యస్ లిమిట్స్ సుబ్బారావు పేట పంచాయతీ పరిధి లో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు వాటి బారిన పడకుండా ఉండాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించడం జరిగింది.
అలాగే, మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన EAGLE టోల్ ఫ్రీ నంబర్ – 1972 గురించి,మరియు ఈగల్ ఇంపాక్ట్ ఆపరేషన్స్- ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, వజ్ర ప్రహర్, ఆపరేషన్ ట్రైన్స్, ఆపరేషన్ గరుడ మరియు BREAK THE SILENCE CALL 1972 "బ్రేక్ ద సైలెన్స్ – కాల్ 1972." మీరు ఎక్కడైనా డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాలు చూస్తే నిశ్శబ్దంగా ఉండకండి, 1972కి కాల్ చేసి సమాచారం ఇవ్వండి. మన అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చుదాం.
పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనిస్తూ, వారిని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడిపేలా తల్లిదండ్రులు మరియు సంరక్షకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించాము.