తేదీ: 15.10.2026
తిరుపతి జిల్లా EAGLE బృందం
BREAK THE SILENCE | OPERATION త్రిషల్
డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం
వేదిక: APSRTC ప్రాంగణం, తిరుపతి
పోలీస్ స్టేషన్ పరిధి: తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్
సబ్ డివిజన్: తిరుపతి సబ్ డివిజన్
జిల్లా: తిరుపతి జిల్లా
కార్యక్రమ వివరాలు:
ఈ రోజు 15.10.2026న తిరుపతి జిల్లా EAGLE బృందం ఆధ్వర్యంలో Break the Silence – Operation Trishool కార్యక్రమంలో భాగంగా APSRTC ప్రాంగణం, తిరుపతిలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది సార్.
ఈ సందర్భంగా APSRTC తిరుపతి DPTO శ్రీ K. శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో EAGLE సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది.
అదేవిధంగా APSRTC సిబ్బందికి క్రింది అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది:
NDPS చట్టం – మాదకద్రవ్యాలపై అవగాహన: గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించడం జరిగింది.
సిబ్బంది అప్రమత్తత: బస్సుల్లో లేదా APSRTC ప్రాంగణంలో అనుమానాస్పద వ్యక్తులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా కార్యకలాపాలు గుర్తించినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది.
EAGLE టోల్‌ఫ్రీ నంబర్ – 1972: డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని సూచించడం జరిగింది.
నార్కో టెర్రరిజం: మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరే ప్రమాదాల గురించి వివరించడం జరిగింది.
డ్రగ్స్ రహిత సమాజం: యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల్లో అవగాహన కల్పించడంలో సహకరించాలని కోరడం జరిగింది.
EAGLE సోషల్ మీడియా ప్రచారం: డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సందేశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు EAGLE సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను అనుసరించాలని సూచించడం జరిగింది.
EAGLE Andhra Pradesh – CALL 1972
DRUGS VADDU BRO – DRUG-FREE ANDHRA PRADESH 🙏