🦅 *EAGLE CELL
YSR KADAPA DISTRICT*
తేదీ: 14-10-2026
Sub-Division: Kadapa
Police Station: Kadapa 1 town PS
స్థలం: లక్ష్య కోచింగ్ అకాడమీ
అటెండెన్స్ : 100 స్టూడెంట్స్
BREAK THE SILENCE
గౌరవ ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ, IPS గారు, ఎస్పీ (Ops) శ్రీ కె.ఎం. మహేశ్వరరాజు, IPS గారు మరియు ఎస్పీ (Admin) శ్రీమతి డి. స్వరూపరాణి గారి ఆదేశాల మేరకు, ఈగల్ సెల్ కడప జిల్లా ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
✅ ఈ సందర్భంగా విద్యార్థులకు EAGLE విభాగం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించి, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
✅ NDPS Act-1985 ప్రకారం మాదకద్రవ్యాల నేరాలకు పాల్పడిన వారిపై తీసుకునే చట్టపరమైన చర్యలు, శిక్షల గురించి వివరించారు.
✅ డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును, కుటుంబాలను, సమాజాన్ని ఏ విధంగా దెబ్బతీస్తుందో వివరించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
✅ *BREAK THE SILENCE – డ్రగ్స్ గురించి మౌనం వీడండి సమాచారం ఇవ్వండి అని నినాదంతో విద్యార్థులు ఎవరు కూడా గంజాయి మరియూ డ్రగ్స్ బారిన పడకూడదని గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి తెలియజేయాలని కోరారు.
👉 విద్యార్థులతో ఈగల్ సర్టిఫికెట్లు మరియు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను సబ్స్క్రైబ్ చేయించడం జరిగింది