🦅 EAGLE – Kakinada District
తేదీ: 02-10-2026
ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రత్తిపాడు గ్రామంలో
“పల్లె బాటలో ఈగల్ – రచ్చబండ – BREAK THE SILENCE” కార్యక్రమం 🦅
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవికృష్ణ, IPS, శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS, SP మరియు శ్రీమతి D. స్వరూప రాణి, SP, EAGLE వారి ఆదేశాల మేరకు పల్లె బాటలో ఈగల్ కార్యక్రమంలో భాగంగా “BREAK THE SILENCE – డ్రగ్స్ గురించి మౌనం వద్దు – సమాచారం ఇవ్వడం మన బాధ్యత” అనే అంశంపై ఈగల్ సెల్, కాకినాడ జిల్లా వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా గంజాయి, మత్తు పదార్థాలు మరియు ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ జీవితం మరియు సమాజంపై కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, తమ స్నేహితులు లేదా పరిచయస్తులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నట్లు గుర్తిస్తే వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
BREAK THE SILENCEలో భాగంగా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు మౌనంగా ఉండకుండా బాధ్యతగా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు.
NDPS Act–1985 గురించి వివరిస్తూ, మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం, రవాణా చేయడం, విక్రయించడం, వినియోగించడం వంటి నేరాలకు సంబంధించిన చట్టపరమైన పరిణామాలు మరియు శిక్షల గురించి వివరించారు.
అలాగే EAGLE చేపడుతున్న Operation చైతన్యం, Operation గరుడ, Operation Safe Campus Zone, Joint Train Operations, వజ్రప్రహార్ మరియు ఇతర డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు.
గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, “డ్రగ్స్ వద్దు బ్రో – BREAK THE SILENCE” అనే సందేశంతో మాదక ద్రవ్యాలపై మౌనం వీడి సమాచారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో EAGLE సిబ్బంది, గ్రామ పెద్దలు, APO గారు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నమస్కారం సార్..
CI, EAGLE కాకినాడ.