జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లా
మండలం: పుట్టపర్తి
పోలీస్ స్టేషన్: పుట్టపర్తి టౌన్ పోలీస్ స్టేషన్
సబ్ డివిజన్: పుట్టపర్తి సబ్ డివిజన్
గ్రామం: బ్రాహ్మణపల్లి తాండా
ఈ రోజు “బ్రేక్ ద సైలెన్స్” కార్యక్రమంలో భాగంగా, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి టౌన్ సీఐ ఆధ్వర్యంలో అత్యంత సున్నితమైన గ్రామంగా గుర్తించిన బ్రాహ్మణపల్లి తాండాను సందర్శించి, గ్రామ ప్రజలకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుమారు 85 మంది గ్రామ ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ మరియు సామాజిక దుష్పరిణామాల గురించి వివరించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబానికి, సమాజానికి, దేశ అభివృద్ధికి కూడా తీవ్ర ఆటంకంగా మారుతుందని తెలియజేశారు.
అలాగే, మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి అందుబాటులో ఉన్న వ్యసన విముక్తి మరియు పునరావాస కేంద్రాల గురించి వివరించి, అవసరమైన వారు తగిన సహాయం పొందాలని సూచించారు. గ్రామంలో ఎక్కడైనా మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే ఈగల్ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1972కు తెలియజేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారిక ఈగల్ సామాజిక మాధ్యమ ఛానళ్లను అనుసరించి, సభ్యత్వం పొందాలని కోరారు.
అదేవిధంగా, తల్లిదండ్రులు తమ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నారు అనే విషయాలను గమనిస్తూ, వారి ప్రవర్తనను నిరంతరం పరిశీలించాలని సూచించారు. పిల్లల్లో ప్రవర్తనా మార్పులు కనిపించినప్పుడు వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి, అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని తెలియజేశారు.
కార్యక్రమం ముగింపులో గ్రామ ప్రజలతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని, ఇతరులకు కూడా మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమం ద్వారా బ్రాహ్మణపల్లి తాండా గ్రామ ప్రజల్లో మాదకద్రవ్యాలపై అవగాహన పెంపొందించి, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు.