EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Guntur - South Sub Division - Nallapadu
Awareness
OFFICIAL

Guntur - South Sub Division - Nallapadu

Conducted: 13 October, 2026 Guntur Venue: Loyola Public School in Ankireddypalem village EAGLE 200 Attendees
🦅గుంటూరు ఈగల్ సెల్🦅
ది.13.10.2026
🚨విషయం: లయోలా పబ్లిక్ స్కూల్‌లో ఎన్‌సీసీ క్యాడెట్లకు మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహణ
➡️ గౌరవనీయులైన ఈగల్ ఐజీపీ శ్రీ ఆకె రవికృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీ మహేశ్వర రాజు ఐపీఎస్ గారి సూచనలతో గుంటూరు ఈగల్ సెల్ ఎస్‌ఐ ఎం. సునీల్ బాబు మరియు సిబ్బంది ఈరోజు, అనగా 13.10.2026న, గుంటూరు సౌత్ సబ్ డివిజన్ పరిధిలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధి, అంకిరెడ్డిపాలెం గ్రామంలోని లయోలా పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన ఎన్‌సీసీ క్యాంపులో విద్యార్థులకు “Break the Silence – Call 1972” కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
➡️ ఈ సందర్భంగా ఎస్‌ఐ గారు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే కాకుండా, వారి ఆరోగ్యం, వ్యక్తిగత గౌరవం మరియు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. విద్యార్థులు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనుకాకుండా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి అక్రమ రవాణా మరియు వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని వెంటనే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని సూచించారు.
➡️ అలాగే, విద్యాసంస్థల పరిసరాల్లో సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఈగల్ విభాగం చేపడుతున్న ఆపరేషన్ సేఫ్ క్యాంపస్, ఆపరేషన్ ట్రైన్స్, ఆపరేషన్ వజ్రప్రహార్, ఆపరేషన్ చైతన్యం వంటి కార్యక్రమాల గురించి వివరించారు. విద్యాసంస్థల పరిసరాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు, మాదకద్రవ్యాల విక్రయాలు గుర్తించినప్పుడు వెంటనే 1972కు సమాచారం అందించాలని కోరారు.
➡️ విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ఈగల్ క్లబ్‌ల ఏర్పాటు ద్వారా మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయడం వంటి చర్యల ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి విద్యార్థి మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, సమాజానికి మరియు దేశానికి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఎస్‌ఐ గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు ఈగల్ సెల్ ఎస్‌ఐ ఎం. సునీల్ బాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.