EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Sri Potti Sriramulu Nellore - Gudur SDPO - Gudur I Town UPS
Awareness
OFFICIAL

Sri Potti Sriramulu Nellore - Gudur SDPO - Gudur I Town UPS

Conducted: 13 October, 2026 Sri Potti Sriramulu Nellore Venue: ZP High School EAGLE 30 Attendees
ఆపరేషన్ త్రిశూల్ & బ్రేక్ ది సైలెన్స్ అవగాహన కార్యక్రమం
తేదీ: 13-10-2026
సబ్ డివిజన్: గూడూరు
ప్రాంతం: గూడూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి

1. జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్‌లో అవగాహన కార్యక్రమం

గౌరవనీయులైన ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ, IPS, SP ఆపరేషన్స్ శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS మరియు SP EAGLE శ్రీమతి D. స్వరూప రాణి గారి ఆదేశాల మేరకు, గూడూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు “డ్రగ్స్ వద్దు బ్రో” కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో విద్యార్థులకు క్రింది అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.

✅ గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు, కుటుంబంపై మరియు సమాజంపై పడే దుష్ప్రభావాలను వివరించడం జరిగింది.

✅ మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల విద్యార్థుల భవిష్యత్తు, విద్యాభ్యాసం మరియు వ్యక్తిగత జీవితంపై కలిగే ప్రతికూల ప్రభావాలను తెలియజేయడం జరిగింది.

✅ ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా డ్రగ్స్ సరఫరా, విక్రయాలు మరియు స్థానిక స్థాయిలో మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లపై చేపడుతున్న చర్యల గురించి వివరించడం జరిగింది. డ్రగ్ డిటెక్షన్ కిట్ల వినియోగంపై కూడా అవగాహన కల్పించడం జరిగింది.

✅ “BREAK THE SILENCE – CALL EAGLE 1972” నినాదం ద్వారా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే మౌనంగా ఉండకుండా EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని సూచించడం జరిగింది. సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేయడం జరిగింది.

✅ NDPS చట్టం ప్రకారం మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలను వివరించి, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.

✅ గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం వల్ల ఆరోగ్యం, కుటుంబం మరియు భవిష్యత్తుపై కలిగే దుష్ప్రభావాలను యువకులకు వివరించడం జరిగింది.

✅ యువత క్రీడలు, వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన అలవాట్లకు ప్రాధాన్యతనిస్తూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సూచించడం జరిగింది.

✅ గంజాయి విక్రయాలు, సరఫరా లేదా ఇతర మాదకద్రవ్యాల కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని కోరడం జరిగింది.

✅ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాలపై మౌనం వీడి సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించాలని అవగాహన కల్పించడం జరిగింది.

ఈ రెండు కార్యక్రమాల్లో నెల్లూరు జిల్లా EAGLE సెల్ సిబ్బంది పాల్గొన్నారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.