ఈరోజు ఆపరేషన్ త్రిశూల్ లో భాగంగా EAGLE సెల్ మరియు స్థానిక పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా, లోతుగడ్డ జంక్షన్ వద్ద మత్తు పదార్థాల దుర్వినియోగం, మహిళల భద్రత మరియు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది.
అలాగే, నూతనంగా అందుబాటులోకి వచ్చిన గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను గుర్తించేందుకు ఉపయోగించే రాపిడ్ టెస్ట్ కిట్లను ప్రదర్శించి, వాటి వినియోగం మరియు మత్తు పదార్థాల వినియోగాన్ని గుర్తించే విధానం గురించి వివరించడం జరిగింది.
అలాగే, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1972 గురించి ప్రజలకు తెలియజేస్తూ, ఎలాంటి సమాచారం ఉన్నా ఈ నంబర్‌కు కాల్ చేసి తెలియజేయాలని అవగాహన కల్పించడం జరిగింది.
Meeting Details:
పోలీస్ స్టేషన్: చింతపల్లి స్టేషన్
జిల్లా: అల్లూరి సీతారామరాజు జిల్లా
మీటింగ్ ప్రదేశం: లోతుగడ్డ జంక్షన్
పాల్గొన్న మహిళలు: 40 మంది
పాల్గొన్న పురుషులు: 60 మంది
మొత్తం పాల్గొన్నవారు: 100 మంది