EAGLE – KAKINADA DISTRICT
తేదీ: 13-10-2026
Sub-Division: పెద్దాపురం సబ్ డివిజన్
Police Station: అన్నవరం పోలీస్ స్టేషన్
స్థలం: నెల్లిపూడి గ్రామం, శంఖవరం మండలం
పల్లెబాటలో ఈగల్ – రచ్చబండ ద్వారా ప్రజలతో ముఖాముఖి – BREAK THE SILENCE కార్యక్రమాన్ని ఈ రోజు నెల్లిపూడి గ్రామంలో నిర్వహించారు.
గౌరవ ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ, IPS గారు, ఎస్పీ (Ops) శ్రీ కె.ఎం. మహేశ్వరరాజు, IPS గారు మరియు ఎస్పీ (Admin) శ్రీమతి డి. స్వరూపరాణి గారి ఆదేశాల మేరకు, ఈగల్ సెల్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
✅ ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు EAGLE విభాగం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించి, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
✅ NDPS Act-1985 ప్రకారం మాదకద్రవ్యాల నేరాలకు పాల్పడిన వారిపై తీసుకునే చట్టపరమైన చర్యలు, శిక్షల గురించి వివరించారు.
✅ డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును, కుటుంబాలను, సమాజాన్ని ఏ విధంగా దెబ్బతీస్తుందో వివరించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
✅ BREAK THE SILENCE – డ్రగ్స్ గురించి మౌనం వద్దు, సమాచారం ఇవ్వడం మన బాధ్యత అనే సందేశంతో, గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
✅ గ్రామ ప్రజలకు సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించి, డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించి, “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో అవగాహన కల్పించారు.
✅ ఈ కార్యక్రమంలో EAGLE సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు సుమారు 50 మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.