ప్రకాశం జిల్లా
ఆపరేషన్ త్రిశూల్ & ఈగల్ పల్లెబాట అవగాహన కార్యక్రమాలు
తేదీ: 13-10-2026
ఒంగోలు సబ్ డివిజన్ లోని టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారెడ్డిపాలెం ఎస్సీ కాలనీలో బ్రేక్ ది సైలెన్స్ మరియు ఈగల్ పల్లెబాట అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమాలలో పాల్గొన్న ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటి దుష్ప్రభావాలు, మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం (NDPS Act) గురించి వివరించడం జరిగింది. మాదకద్రవ్యాల వినియోగం లేదా సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు మౌనంగా ఉండకుండా సంబంధిత అధికారులకు, ఈగల్ టోల్ free నెంబర్ 1972 కు తెలియజేయాలని సూచించడం జరిగింది.