EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Tirupathi - Chandragiri SDPO - Tirupati Rural UPS
Awareness
OFFICIAL

Tirupathi - Chandragiri SDPO - Tirupati Rural UPS

Conducted: 12 October, 2026 Tirupathi Venue: TUDA Park, Tirupati EAGLE 34 Attendees
తిరుపతి జిల్లా
ఆపరేషన్ త్రిశూల్ & బ్రేక్ ది సైలెన్స్ అవగాహన కార్యక్రమం
తేదీ: 12-10-2026
వేదిక: తుడా పార్క్, తిరుపతి
పోలీస్ స్టేషన్ పరిధి: ఎం.ఆర్. పల్లి పోలీస్ స్టేషన్
సబ్ డివిజన్: చంద్రగిరి

తేదీ 12-10-2026న తిరుపతి జిల్లా ఈగల్ బృందం ఆధ్వర్యంలో, ఎం.ఆర్. పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తుడా పార్క్ వద్ద ఆపరేషన్ త్రిశూల్ మరియు బ్రేక్ ది సైలెన్స్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటి దుష్ప్రభావాలు, మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం (NDPS Act) గురించి వివరించడం జరిగింది.

అలాగే, నార్కో టెర్రరిజం (మాదకద్రవ్యాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం) వల్ల దేశ భద్రతకు కలిగే ముప్పు గురించి అవగాహన కల్పించడం జరిగింది.

బ్రేక్ ది సైలెన్స్ కార్యక్రమంలో భాగంగా, మాదకద్రవ్యాల వినియోగం లేదా సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు మౌనంగా ఉండకుండా సంబంధిత అధికారులకు, ఈగల్ టోల్ free నెంబర్ 1972 కు తెలియజేయాలని విద్యార్థులకు సూచించడం జరిగింది. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా విద్యార్థులకు ఈగల్ ఆన్‌లైన్ ప్రతిజ్ఞ కార్యక్రమం గురించి వివరించి, ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అలాగే, ఈగల్ సంస్థకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ పేజీని అనుసరించడం ద్వారా మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలను మరింత మందికి చేరవేయాలని సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన పెంపొందించేందుకు కృషి చేయడమైనది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.