EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Ananthapuram - Anantapuram Rural SDPO - Anantapur Rural
Awareness
OFFICIAL

Ananthapuram - Anantapuram Rural SDPO - Anantapur Rural

Conducted: 12 October, 2026 Ananthapuram Venue: బ్రాహ్మణపల్లి ఎన్‌సీసీ క్యాంపు EAGLE 300 Attendees
ఈగల్ సెల్ – అనంతపురం జిల్లా

📅 తేదీ: 12-10-2026

🚫 “ *డ్రగ్స్ వద్దు బ్రో – జీవితం ముద్దు బ్రో”

📢 మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం

“ BREAK THE SILENCE – CALL EAGLE 1972”

ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, అనంతపురం రూరల్ సబ్ డివిజన్ పరిధిలోని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి బ్రాహ్మణపల్లి ఎన్‌సీసీ క్యాంపు నందు ఈగల్ సెల్ అనంతపురం జిల్లా బృందం ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది ఎన్‌సీసీ విద్యార్థినీ, విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఇబ్బందులు, విద్యాభ్యాసంపై ప్రభావం, ఆర్థిక నష్టాలు మరియు భవిష్యత్తుపై పడే దుష్ప్రభావాల గురించి వివరంగా అవగాహన కల్పించడం జరిగింది.

🎯 మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన:

విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని, విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి మరియు ఆరోగ్యకరమైన జీవన విధానంపై దృష్టి సారించాలని సూచించడం జరిగింది. యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా, తమ లక్ష్యాలను నిర్దేశించుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని తెలియజేయడం జరిగింది.

⚖️ చట్టపరమైన అవగాహన – ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ :

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, సరఫరా మరియు వినియోగానికి సంబంధించిన చట్టపరమైన అంశాలను వివరిస్తూ, ఎన్‌డీపీఎస్ చట్టం–1985 (NDPS Act), సీఓటీపీఏ చట్టం–2003 (COTPA Act) గురించి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే విద్యాసంస్థల పరిసరాల్లో మాదకద్రవ్యాలు, పొగాకు ఉత్పత్తులు మరియు ఇతర హానికర పదార్థాలకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ప్రాముఖ్యతను వివరించడం జరిగింది.

🛡️ ఆపరేషన్ త్రిశూల్:

ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా యువతలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన పెంపొందించడం, మహిళల భద్రత, రహదారి భద్రత మరియు సామాజిక బాధ్యతపై అవగాహన కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. విద్యార్థులు చట్టాలను గౌరవిస్తూ, తమ పరిసరాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది.

📢 బ్రేక్ ద సైలెన్స్ – కాల్ ఈగల్ 1972:

మాదకద్రవ్యాల అక్రమ విక్రయం, సరఫరా, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు మౌనంగా ఉండకుండా, వెంటనే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972 కు సమాచారం అందించాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. సమాచారదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని వివరించి, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.

📱 ఈగల్ ప్రతిజ్ఞ మరియు సామాజిక మాధ్యమాల ప్రచారం:

ఈ సందర్భంగా సుమారు 300 మంది ఎన్‌సీసీ విద్యార్థినీ, విద్యార్థులతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఇతరులను కూడా వాటికి దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తామని, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1972కు తెలియజేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

అలాగే ఈగల్ కార్యక్రమాలపై మరింత అవగాహన కల్పించేందుకు, ఈగల్ క్లబ్ యొక్క లక్ష్యాలు, ప్రాముఖ్యతను వివరించి, ఈగల్ ఆంధ్రప్రదేశ్ అధికారిక సామాజిక మాధ్యమ వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్లను అనుసరించడం మరియు చందాదారులుగా చేరడం ద్వారా మాదకద్రవ్యాల వ్యతిరేక సందేశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని విద్యార్థులకు సూచించడం జరిగింది.

🤝 యువత భాగస్వామ్యంతోనే మాదకద్రవ్యాల రహిత సమాజం సాధ్యం.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి – ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోండి. మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కండి.

ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ సిబ్బంది మరియు ఈగల్ సెల్ అనంతపురం జిల్లా బృందం పాల్గొనడం జరిగింది.

🦅 ఈగల్ సెల్ – అనంతపురం జిల్లా

🚫 డ్రగ్స్ వద్దు బ్రో – జీవితం ముద్దు బ్రో

📞 BREAK THE SILENCE – CALL EAGLE 1972
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.