Community paramedics & Primary Health care providers మరియు రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యం లో మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు మరియు ర్యాలీ
North Zone-గోకవరం మండలం & PS-తూర్పుగోదావరి జిల్లా
ప్రధానమంత్రి గారి వికసిత భారత్ కార్యక్రమం లో భాగంగా ఈరోజు రాజమండ్రి, గోకవరం లో ఉన్న MVR కన్వెన్షన్ నందు మాదకద్రవ్యాల పై Community paramedics & Primary Health care providers & EAGLE ఆధ్వర్యం లో అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది.
✅ ఈ కార్యక్రమంలో 100 మంది RMP లు మరియు మెడికల్ shops వారు పాల్గొన్నారు. వారికి Operation గరుడ, recent గా జరిగిన జంగారెడ్డిగూడెం case study, BREAK THE SILENCE-CALL 1972 మరియు Eagle works గురించి వివరించడం జరిగింది.
✅ అదేవిధంగా, మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబం మరియు సమాజంపై కలిగే దుష్ప్రభావాలను వివరించి, భవిష్యత్తులో ఇటువంటి నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు.
✅ గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడినవి తెలపడమైనది.
✅ EAGLE IGP గారు అందచేసిన EAGLE Commendation Certificate ను Gokavaram SI గారికి అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమం లో
1) డా.మొల్లేటి రామ్మోహన్ గారు Superindent, ARCA Hospital Rajahmundry
2)తూర్పుగోదావరి జిల్లా PMC అధ్యక్షుడు బల్లా శ్రీనివాస్ గారు
3)ఈగల్ సీఐ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు