తేదీ:10-10-2026
స్థలం: చియ్యేడు గ్రామం, ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధి
థీమ్: “ BREAK THE SILENCE – CALL 1972”
ఈరోజు అనంతపురం జిల్లా, అనంతపురం రూరల్ సబ్-డివిజన్,ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చియ్యేడు గ్రామంలో , ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో “ పల్లె బాటలో ఈగల్” కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు మాదకద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించడం జరిగింది.
ప్రధానంగా “ BREAK THE SILENCE – CALL 1972” అనే థీమ్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినప్పుడు నిశ్శబ్దాన్ని వీడి 1972కు కాల్ చేసి సమాచారాన్ని తెలియజేయాలని సూచించడం జరిగింది. ప్రజల సహకారంతో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వివరించడం జరిగింది.
అలాగే స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి ఆపరేషన్ త్రిశూల్ గురించి ప్రజలకు వివరించి, మాదకద్రవ్యాల వినియోగం మరియు అక్రమ కార్యకలాపాల నియంత్రణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని సూచించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రజలకు
- 🚫 మాదకద్రవ్యాల నిర్మూలన (Drug Abuse Prevention)
- 👮 పోలీసులతో సమన్వయం మరియు ప్రజల భాగస్వామ్యం
వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.
మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు అప్రమత్తంగా ఉండి, తమ పరిసరాల్లో మాదకద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినప్పుడు వెంటనే 1972కు సమాచారం అందించాలని ఈగల్ టీమ్ సూచించడం జరిగింది.
“ BREAK THE SILENCE – CALL 1972”
నిశ్శబ్దాన్ని వీడండి – మాదకద్రవ్యాలపై సమాచారం కోసం 1972కు కాల్ చేయండి.