తేదీ: 10.10. 2026
స్థలం: జెకెసి కాలేజ్ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధి గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ గుంటూరు జిల్లా
గౌరవనీయులు ఈగల ఐజిపి శ్రీ ఆకె రవికృష్ణ ఐపీఎస్ గారి ఆదేశానుసారము ఈగల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీ మహేశ్వర రాజు ఐపీఎస్ గారి సూచనలతో ఈరోజు గుంటూరు ఈగల్ సెల్ జికేసి కాలేజ్ నందు మై భారత్ విభాగంతో నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి గుంటూరు రేంజ్ ఈగల్ సేల్స్ ఇన్చార్జి సిఐ శ్రీ కె విక్టర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడినారు
జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి (జేకేసీ) కళాశాలలో నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) ఆధ్వర్యంలో, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్ (MY Bharat) కార్యక్రమానికి అనుబంధంగా ‘నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్ – 2026–27’ కార్యక్రమాన్ని ‘నషా ముక్త్ యువా’ (మాదకద్రవ్యాల రహిత యువత) అనే ఇతివృత్తంతో నిర్వహించారు.
🔶గుంటూరు ఈగల్ సెల్ ఇన్‌స్పెక్టర్ కె. విక్టర్ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థకు, సమాజానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని వివరించారు.
🔶మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా వచ్చే నిధులు ఉగ్రవాద కార్యకలాపాలకు దోహదపడే ప్రమాదం ఉందని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ దేశాలతో కూడిన గోల్డెన్ క్రెసెంట్, లావోస్, మయన్మార్, థాయిలాండ్ దేశాలతో కూడిన గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల మధ్య భారతదేశం భౌగోళికంగా ఉన్నందున మాదకద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
🔶విద్యార్థులు ముఖ్యంగా పీర్ ప్రెజర్ (తోటి వారి ఒత్తిడి) కు లొంగకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. స్నేహితుల ప్రోద్బలంతో సిగరెట్లు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని హెచ్చరించారు.క్షణికావేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు.
🔶ఈ సందర్భంగా గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సైకియాట్రీ విభాగానికి సంబంధించిన ఒక కేస్ స్టడీని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, చిన్న వయస్సులోనే మాదకద్రవ్యాల బారిన పడటం వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించాలని, అవసరమైన సందర్భాల్లో కౌన్సెలింగ్ అందించాలని సూచించారు.
🔶ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో భాగంగా విద్యాసంస్థల పరిసరాల్లో మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలు, వినియోగం, ఇతర అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సురక్షితమైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
🔶అలాగే ఏపీ ఈగల్ విభాగం గుంటూరు ఈగల్ సెల్ ఆధ్వర్యంలో అనుమానిత వ్యక్తులను, అనుమానాస్పద ప్రాంతాలను, మాదకద్రవ్యాల వినియోగానికి అవకాశం ఉన్న హాట్‌స్పాట్లను గుర్తించి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్ డిటెక్షన్ కిట్ల సహాయంతో మాదకద్రవ్యాల వినియోగ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నట్లు వివరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు స్థానిక పోలీసులతో సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
🔶ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయాలు, వినియోగం, అక్రమ రవాణా లేదా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించినట్లయితే వెంటనే *ఏపీ ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972*కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
🔶యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును కాపాడుకోవాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
🔶“బ్రేక్ ది సైలెన్స్ – కాల్ ఈగల్ 1972” అనే నినాదంతో మాదకద్రవ్యాలపై పోరాటంలో యువత, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
🔶ఈ కార్యక్రమంలో మై భారత్ ఇంచార్జి కిరణ్ మై గారు ఈగల్ సెల్ ఇన్‌స్పెక్టర్ కె. విక్టర్, ఎస్సైలు సునీల్ బాబు, రాజశేఖర్, పోలీసు సిబ్బంది, కళాశాల యాజమాన్య ప్రతినిధులు, అధ్యాపకులు మరియు సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.