NTR Dist.
తేదీ:10-10-2026.
🦅 “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం
ఈరోజు గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS మరియు శ్రీమతి జి. స్వరూప రాణి, SP, EAGLE వారి ఆదేశాల మేరకు, ఎన్టీఆర్ జిల్లా ఈగల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈగల్ సిబ్బంది, పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోనగర్ లో “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
✅ ఈ సందర్భంగా ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, జాయింట్ ట్రైన్ ఆపరేషన్స్ మరియు EAGLE కార్యకలాపాల గురించి వివరించడం జరిగింది.
✅ డ్రగ్స్ దుర్వినియోగం, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వాటి ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావం తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది.
✅ సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పిస్తూ, సైబర్ మోసాలకు గురైనప్పుడు వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించడం జరిగింది.
✅ NDPS చట్టం కింద కేసుల్లో ఇరుక్కుంటే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు మరియు శిక్షల గురించి స్పష్టంగా తెలియజేయడం జరిగింది.
✅ గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలపై ఎటువంటి సమాచారం ఉన్నా 1972 టోల్‌ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని, సమాచారమిచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేయడం జరిగింది.
👮♂️ ఈ కార్యక్రమంలో ఈగల్ RSI, R. Sreerama Murthy & PC Krishna పాల్గొన్నారు.
👥 ఈ అవగాహన కార్యక్రమంలో సుమారు 150 మంది ప్రజలు పాల్గొన్నారు.