EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Krishna - Gannavaram SDPO - Kankipadu
Awareness
OFFICIAL

Krishna - Gannavaram SDPO - Kankipadu

Conducted: 09 October, 2026 Krishna Venue: S.T .MARY'S ENGLISH MEDIUM SCHOOL. EAGLE 50 Attendees
🦅 EAGLE అవగాహన కార్యక్రమం – కృష్ణా జిల్లా
📅 తేదీ: 09-10-2026
📍 వేదిక: S.T .MARY'S ENGLISH MEDIUM SCHOOL.
(కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధి)
(గన్నవరం సబ్ డివిజన్)
📌 కార్యక్రమ వివరాలు:
ఈ రోజు కంకిపాడులోని S.T .MARY'S ENGLISH MEDIUM SCHOOL. విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు "BREAK THE SILENCE" అంశాలపై EAGLE ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవికృష్ణ, IPS, కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS, శ్రీమతి D. స్వరూప రాణి, SP, మరియు అదనపు ఎస్పీ శ్రీ Ch. శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు... కృష్ణా జిల్లా EAGLE సెల్ ఇన్‌ఛార్జ్ శ్రీ M. రవీంద్ర, CI ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
👥 పాల్గొన్న ప్రముఖులు & EAGLE టీమ్:
* శ్రీ మనోహర్ (ASI)
* శ్రీ K. మురళీమోహన్
* ఆకర్ష ఫౌండేషన్ ప్రతినిధులు
* S.T .MARY'S ENGLISH MEDIUM SCHOOL సిబ్బంది మరియు సుమారు 500 మంది విద్యార్థులు
💡 కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు & ముఖ్యాంశాలు:
* 🛑 మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు:
మనోహర్ ASI గారు మాట్లాడుతూ... గంజాయి, మత్తు పదార్థాలు మరియు ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితం ఎలా నాశనమవుతాయో వివరించారు.
* ⚖️ చట్టపరమైన పరిణామాలు (NDPS Act–1985):
NDPS Act–1985 చట్టం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం, రవాణా చేయడం, విక్రయించడం మరియు వినియోగించడం వంటి నేరాలకు చట్టపరంగా ఎదురయ్యే కఠిన శిక్షల గురించి తెలిపారు.
* 🗣️ BREAK THE SILENCE (మౌనం వీడండి):
డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు ఎవరూ మౌనంగా ఉండకూడదని, బాధ్యతగల పౌరులుగా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండటమే కాకుండా, తమ స్నేహితులు లేదా పరిచయస్తులు ఎవరైనా ఈ ఊబిలో చిక్కుకుంటున్నట్లు గమనిస్తే వారికి వెంటనే అవగాహన కల్పించి కాపాడాలని పిలుపునిచ్చారు.
* 🛡️ EAGLE ప్రత్యేక కార్యక్రమాలు:
EAGLE విభాగం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న వివిధ చైతన్య కార్యక్రమాలైన... చైతన్యం, గరుడ, సేఫ్ క్యాంపస్ జోన్, జాయింట్ ట్రైన్ ఆపరేషన్స్, వజ్రప్రహార్ తదితర అంశాల గురించి విద్యార్థులకు వివరించారు.
* 📞 టోల్ ఫ్రీ నంబర్:
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే EAGLE టోల్ ఫ్రీ నంబర్ - 1972 కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు.
> ✨ “డ్రగ్స్‌కు NO చెప్పండి – జీవితానికి YES చెప్పండి.” ✨
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.