విశాఖపట్నం జిల్లా.....
*ఈగల్ సెల్
*తేదీ: *09.10.2026
➡️ డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలి
( *బ్రేక్ ది సైలెన్స్ )
👉 గౌరవ ఈగల్ IGP శ్రీ ఆకే రవికృష్ణ, ఐ.పీ.ఎస్ గారి ఉత్తర్వుల మేరకు, శ్రీ మహేశ్వర రాజు గారు IPS, SP ఈగల్, & శ్రీమతి స్వరూపా రాణి గారు SP ఈగల్ అడ్మిన్ మరియు addl sp CH. Srinivasa Rao సూచనలు మేరకు విశాఖపట్నం ఈగల్ సెల్ సీఐ Dr.T. కల్యాణి మేడం గారి ఆద్వర్యంలో వారి సూచనల మేరకు
ద్వారక సబ్ డివిజన్
PS. అరిలోవ
GOVERNMENT OF ANDHRA PRADESH Department of technical education FOOD CRAFT INSTITUTE
Attendence. 90
అక్కడి విద్యార్థులకు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వల్ల జరిగే దుష్పరిణామాల గురించి అవగాహన కార్యక్రమము, మరియూ, BREAK THE SILENCE కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది
👉 ఈగల్ అధికారులు విద్యార్థులు ను ఉద్దేశించి
“మాదక ద్రవ్యాలు వ్యక్తిని కాదు, కుటుంబాన్ని కాదు, సమాజాన్నే నాశనం చేస్తాయి. డ్రగ్-ఫ్రీ విశాఖ జిల్లా నిర్మాణంలో విద్యార్థులు అందరూ భాగస్వాములు కావాలి” అని పిలుపును ఇవ్వడం జరిగింది మరియు విద్యార్థులు చే ప్లెడ్జి చేయించి సర్టిఫికెట్ డౌన్లోడ్ చేయించడం జరిగింది
🔷 కార్యక్రమంలో చర్చించిన ముఖ్య అంశాలు:
1️⃣ ఈగల్ బృందం అవగాహన – డ్రగ్స్‌కు చెక్ పెట్టడానికి ప్రత్యేక దళం:
👉 రాష్ట్రవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దళం EAGLE (Elite Anti-Narcotics Group for Law Enforcement) గురించి ప్రజలకు వివరించారు.
డ్రగ్స్ ఉత్పత్తి, నిల్వ, రవాణా, అమ్మకం, వినియోగం — ఇవన్నీ NDPS చట్టం ప్రకారం తీవ్రమైన నేరాలు.
వీటికి దీర్ఘకాల కారాగార శిక్షలు, భారీ జరిమానాలు ఉంటాయని విద్యార్ధులకు స్పష్టంగా చెప్పడం జరిగింది
2️⃣ “1972” టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ – మీ సమాచారం, మీ పేరు గోప్యం
మీ ప్రాంతంలో
▪️ గంజాయి విక్రయం
▪️ డ్రగ్స్ వినియోగం
▪️ అనుమానాస్పద వ్యక్తుల రాకపోకలు
గమనిస్తే వెంటనే 1972 నంబర్‌కి సమాచారం ఇవ్వాలని.
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పడం జరిగింది.
ఈగల్ బృందం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియూ BREAK THE SILENCE గురించి వివరించడం జరిగింది
3️⃣ సైబర్ నేరాలపై అప్రమత్తం
ప్రజలకు సూచనలు:
తెలియని లింకులు, ఫ్రాడ్ మెసేజ్‌లు క్లిక్ చేయవద్దు.
OTP, బ్యాంకు సమాచారం, PAN వివరాలు పంచుకోవద్దు.
సోషల్ మీడియాలో అజ్ఞాత వ్యక్తులతో చాట్ చేయడం, ఫోటోలు షేర్ చేయడం ప్రమాదకరం అని తెలియజేయడం జరిగింది