EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Kurnool - Kurnool SDPO - Ulindakonda
Awareness
OFFICIAL

Kurnool - Kurnool SDPO - Ulindakonda

Conducted: 09 October, 2026 Kurnool Venue: BRUNDAVAN INSTITUTE OF TECHNOLOGY AND SCIENCE ENGINEERING COLLEGE EAGLE 550 Attendees
EAGLE అవగాహన కార్యక్రమం – కర్నూలు జిల్లా

తేదీ: 09-10-2026

📍వేదిక: BRUNDAVAN INSTITUTE OF TECHNOLOGY AND SCIENCE ENGINEERING COLLEGE

🏘️ గ్రామం: CHINNA TEKURU VILLAGE

🚓 పోలీస్ స్టేషన్: ULINDAKINDA PS

📌 రూరల్ సబ్ డివిజన్: KURNOOL RURAL DIVISION

కర్నూలు జిల్లాలోని BRUNDAVAN INSTITUTE OF TECHNOLOGY AND SCIENCE ENGINEERING COLLEGE, CHINNA TEKURU నందు విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు “BREAK THE SILENCE” అంశాలపై EAGLE అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో EAGLE సిబ్బందితో పాటు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ S. Ramesh Reddy, శ్రీ S. Abdul Yunus Basha, శ్రీ G. Phani Kumar Reddy, శ్రీ N. Shiva Prasad Reddy తదితరులు పాల్గొన్నారు.

🎓 మొత్తం విద్యార్థుల పాల్గొనడం

ఈ అవగాహన కార్యక్రమంలో మొత్తం 550 మంది కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

🚫 మాదక ద్రవ్యాలపై అవగాహన – NDPS ACT, 1985

విద్యార్థులకు NDPS Act – Narcotic Drugs and Psychotropic Substances Act, 1985 గురించి అవగాహన కల్పించడం జరిగింది. మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం, రవాణా చేయడం, విక్రయించడం, వినియోగించడం వంటి నేరాలకు సంబంధించిన చట్టపరమైన పరిణామాలను వివరించడం జరిగింది.

🔇 BREAK THE SILENCE – మౌనం వీడి మాట్లాడండి

డ్రగ్స్‌కు సంబంధించిన సమస్యలను దాచిపెట్టకుండా మౌనం వీడి మాట్లాడాలని, అవసరమైన సహాయం మరియు సరైన మార్గదర్శకత్వం పొందాలని విద్యార్థులకు సూచించడం జరిగింది. తమ స్నేహితులు డ్రగ్స్‌కు ఆకర్షితులవుతున్నట్లు గుర్తిస్తే వారిని నిర్లక్ష్యం చేయకుండా, వారికి అవగాహన కల్పించి అవసరమైన సహాయం అందించాలని సూచించారు.

🦅 EAGLE ORGANIZATION లక్ష్యాలు

EAGLE Organization లక్ష్యాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం చేపడుతున్న చర్యలు, యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది.

🇮🇳 NARCO-TERRORISM పై అవగాహన

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వల్ల సమాజానికి, యువతకు కలిగే నష్టాలతో పాటు, నార్కో టెర్రరిజం ద్వారా దేశ భద్రతకు ఎదురయ్యే ప్రమాదాలను వివరించడం జరిగింది. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

📞 EAGLE TOLL-FREE NUMBER – 1972

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు EAGLE టోల్ ఫ్రీ నంబర్ – 1972 కు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించడం జరిగింది.

అలాగే, EAGLE Organization సోషల్ మీడియా వేదికలను ఫాలో అవుతూ, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.

🎯 యువతకు ప్రత్యేక సందేశం

“డ్రగ్స్‌కు NO చెప్పండి – జీవితానికి YES చెప్పండి.”

“యువతే దేశ భవిష్యత్తు – డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి.”

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన పెంపొందించడంతో పాటు, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి విద్యార్థి తన వంతు బాధ్యతగా పనిచేయాలని పిలుపునివ్వడం జరిగింది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.