EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Eluru - Eluru SDPO - Eluru III Town
Awareness
OFFICIAL

Eluru - Eluru SDPO - Eluru III Town

Conducted: 09 October, 2026 Eluru Venue: Aditya Degree College, Satram Padu, EAGLE 299 Attendees
ఏలూరు EAGLE సెల్
తేదీ: 09-10-2026

విషయం: Nasha Mukt Yuva for Viksit Bharat కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహణ – గురించి.

📍 వేదిక: ఆదిత్య డిగ్రీ కాలేజ్, సత్రంపాడు, ఏలూరు
🤝 సహకారం: MY Bharat టీమ్, Ministry of Youth Affairs

కార్యక్రమ ముఖ్యాంశాలు:

1. 🏆 విద్యార్థులకు వివిధ పోటీలు:
డ్రాయింగ్, డిబేట్, ఎస్సే రైటింగ్, గ్రూప్ డిస్కషన్, షార్ట్ ఫిల్మ్ తదితర పోటీలు నిర్వహించి, విజేతలకు సర్టిఫికెట్లు మరియు బహుమతులు అందజేయడం జరిగింది.

2. 🚫 మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన:
ఏలూరు EAGLE సెల్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను ఉదాహరణలతో వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించడం, వారి సందేహాలను నివృత్తి చేయడం జరిగింది.

3. 🤝 నశా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ (PLEDGE):
నశా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.

4. 🚨 నార్కో టెర్రరిజం (NARCO-TERRORISM):
మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా యువతను లక్ష్యంగా చేసుకునే కార్యకలాపాలు, నార్కో టెర్రరిజం వల్ల యువతకు, సమాజానికి కలిగే నష్టాలు మరియు దేశ భద్రతకు ఎదురయ్యే ముప్పుల గురించి వివరించడం జరిగింది.

5. 🦅 EAGLE ప్రత్యేక కార్యక్రమాలు:
మాదకద్రవ్యాల నియంత్రణ, యువతలో చైతన్యం పెంపొందించడం కోసం EAGLE సెల్ చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి తెలియజేయడం జరిగింది.

6. 📢 BREAK THE SILENCE – CALL 1972:
మాదకద్రవ్యాల వినియోగం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు మౌనం వీడి ముందుకు రావాలని, సంబంధిత సమాచారాన్ని EAGLE టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1972కు తెలియజేయాలని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.