పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి లంకలకోడేరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించడం జరిగింది అలాగే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 గురించి చెప్పడం జరిగింది ndps చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది అలాగే సైబర్ మోసాలపై అవగాహన కల్పించడం జరిగింది ఈగల్ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. అలాగే ఆపరేషన్ త్రిశూల్ గురించి అవగాహన కల్పించడం జరిగింది అనంతరం విద్యార్థుల చేత డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సిబ్బంది రూరల్ పోలీస్ స్టేషన్ ఎఎస్ఐ గారు హెడ్ కానిస్టేబుల్ గారు మరియు ఈగల్ టీం పాల్గొనడం జరిగింది