EAGLE – తిరుపతి జిల్లా
డ్రగ్స్ అవగాహన కార్యక్రమం – BREAK THE SILENCE & ఆపరేషన్ త్రిశూల్
తేదీ: 09-10-2026
📍 స్థలం: శ్రీ పద్మావతి మహిళా విద్యాకళాశాల, తిరుపతి
🚔 పోలీస్ స్టేషన్ పరిధి: తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్
ఈ రోజు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విద్యాకళాశాలలో మొదటి సంవత్సరం MBBS విద్యార్థినులు సుమారు 150 మంది పాల్గొనగా, EAGLE సంస్థ, తిరుపతి పోలీసుల ఆధ్వర్యంలో BREAK THE SILENCE మరియు ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో EAGLE బృంద సభ్యులు కమల్, గోవిందస్వామి, గిరిబాబు, కామేశ్వర నాయుడు పాల్గొని, EAGLE సంస్థ ఏర్పాటు లక్ష్యాలు, మాదకద్రవ్యాల నియంత్రణలో సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. అలాగే, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1972 కు సమాచారం అందించాలని సూచించారు.
SI సుబ్బారెడ్డి గారు ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం యొక్క లక్ష్యాలను వివరిస్తూ, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. విద్యార్థినులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సమాజంలోని యువతకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా “డ్రగ్స్ వద్దు బ్రో – ఆరోగ్యకరమైన జీవితానికి అవును చెప్పండి” అనే సందేశాన్ని విద్యార్థినులకు తెలియజేస్తూ, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనారోగ్య, సామాజిక మరియు కుటుంబపరమైన దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి గారు, SI సుబ్బారెడ్డి గారు, అడ్వకేట్ వెంకటేష్ గారు, ఉత్థరాధి గారు, సామాజికవేత్త నాగేష్ గారు, EAGLE బృంద సభ్యులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం.