నెల్లూరు ఈగల్ సెల్ – డ్రగ్ అవేర్‌నెస్ & “BREAK THE SILENCE” కార్యక్రమ నివేదిక
జిల్లా: SPSR నెల్లూరు జిల్లా
తేదీ: 09.10.2026
సమయం: ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
వేదిక: నారాయణ మెడికల్ కాలేజీ, నెల్లూరు
ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ, నెల్లూరులో నషా ముక్త్ యువా కార్యక్రమంతో కలిసి నెల్లూరు ఈగల్ సెల్ ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్‌నెస్ మరియు “BREAK THE SILENCE” కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నారాయణ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, నెల్లూరు రూరల్ సీఐ గారు, ఇతర సంబంధిత అధికారులు మరియు నూతనంగా మెడికల్ కాలేజీలో చేరిన సుమారు 500 మంది వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, మత్తుపదార్థాల వ్యసనం వల్ల ఆరోగ్యంపై కలిగే నష్టాలు మరియు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించడం జరిగింది.
అలాగే, ఈగల్ సెల్ నిర్వహిస్తున్న వివిధ ఆపరేషన్లు, మాదకద్రవ్యాల నిర్మూలనలో ఈగల్ సెల్ పాత్ర మరియు ఈగల్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1972 గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ విక్రయాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు 1972 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని సూచించడం జరిగింది.
ఈగల్ సెల్‌కు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు అధికారిక వెబ్‌సైట్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి, వాటిని సబ్‌స్క్రైబ్ చేయించడం జరిగింది. అదేవిధంగా, విద్యార్థులతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
“Drugs Vaddu Bro” మరియు “BREAK THE SILENCE” సందేశాల ద్వారా విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక చైతన్యాన్ని పెంపొందించి, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది.
మొత్తం పాల్గొన్నవారు: సుమారు 500 మంది వైద్య విద్యార్థులు.