KAKINADA EAGLE CELL
తేదీ: 09-10-2026
📍 వేదిక: ఆదిత్య డిగ్రీ కాలేజీ, అయోధ్య నగర్ కాకినాడ.
III టౌన్ P.S.
NASHA MUKT YUVA FOR VIKASIT BHARAT
కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రతిజ్ఞ, ర్యాలీ నిర్వహణ
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir EAGLE వారి ఆదేశాల మేరకు “NASHA MUKT YUVA FOR VIKASIT BHARAT” కార్యక్రమం ఈరోజు యువతకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన ర్యాలీ *ఈగల్ మరియు NSS ఆదిత్య కాలేజీ వారి ఆధ్వర్యం లో నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో సంకల్ప ప్రతిజ్ఞ (Sankalp Pledge) చేయించి, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలన, యువతలో చైతన్యం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, వికసిత భారత్ లక్ష్య సాధనలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు
*నషా ముక్త యువత – వికసిత భారత్!
డ్రగ్స్ వద్దు బ్రో – ఆరోగ్యమే మన బలం!
కాలేజీ విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు BREAK THE SILENCE అంశంపై EAGLE అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
“డ్రగ్స్‌కు NO చెప్పండి – జీవితానికి YES చెప్పండి.”
ఈ కార్యక్రమంలో కాకినాడ EAGLE సిబ్బంది,కాలేజీ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది, సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు.