EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Vizianagaram - Vizianagaram SDPO - Vizianagaram I Town
Awareness
OFFICIAL

Vizianagaram - Vizianagaram SDPO - Vizianagaram I Town

Conducted: 09 October, 2026 Vizianagaram Venue: T.A.T. ITI College, Bingi Veedhi EAGLE 61 Attendees
విజయనగరం జిల్లా EAGLE సెల్ | తేదీ: 09-10-2026

విజయనగరం సబ్‌డివిజన్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బింగి వీధిలో ఉన్న T.A.T. ITI కళాశాల విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వినియోగం వల్ల విద్య, ఆరోగ్యం, కుటుంబ జీవితం, భవిష్యత్తుపై కలిగే ప్రతికూల ప్రభావాలను విద్యార్థులకు వివరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

విద్యార్థులు తమ పరిసరాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించినప్పుడు మౌనం వీడి, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అవగాహన కల్పించారు.

“BREAK THE SILENCE” సందేశం ద్వారా డ్రగ్స్‌పై మౌనం వీడి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాల వివరాలను EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని సూచించారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.