EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 05 October, 2026
100%
EAGLE
› News & Updates › NRX డ్రగ్స్ విక్రయాలపై శివ సాయి మెడికల్స్ యజమానికి వివరణ కోరిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆపరేషన్ గరుడలో భాగంగా సాలూరులో మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు
OFFICIAL

NRX డ్రగ్స్ విక్రయాలపై శివ సాయి మెడికల్స్ యజమానికి వివరణ కోరిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆపరేషన్ గరుడలో భాగంగా సాలూరులో మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు

ఆపరేషన్ గరుడలో భాగంగా సాలూరులో మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు

Published: 22 September, 2026

NRX డ్రగ్స్ విక్రయాలపై శివ సాయి మెడికల్స్ యజమానికి వివరణ కోరిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆపరేషన్ గరుడలో భాగంగా సాలూరులో మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు

Cover Image

NRX డ్రగ్స్ విక్రయాలకు సంబంధించిన రికార్డులు, సంబంధిత పత్రాల విషయంలో సాలూరు పట్టణంలోని శ్రీ శివ సాయి మెడికల్స్ యజమాని నుండి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. యుగంధర్ వివరణ కోరారు. ఆపరేషన్ గరుడలో భాగంగా సోమవారం సాలూరు పట్టణంలోని మెడికల్ షాపులపై నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది.

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎన్. మాధవ్ రెడ్డి, ఈగల్ జిల్లా ఇన్‌చార్జి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. యుగంధర్ ఆధ్వర్యంలో ఈగల్ టీం, సాలూరు టౌన్ పోలీస్ సిబ్బందితో కలిసి శ్రీ శివ సాయి మెడికల్స్, అపోలో మెడికల్స్‌లో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మెడికల్ షాపుల్లో ఉన్న NRX డ్రగ్స్ స్టాక్, విక్రయ రికార్డులు, ఇన్వాయిస్ బిల్లులు, సంబంధిత పత్రాలను అధికారులు పరిశీలించారు.

శ్రీ శివ సాయి మెడికల్స్‌లో NRX డ్రగ్స్‌కు సంబంధించిన విక్రయ రికార్డులు, పత్రాల విషయంలో స్పష్టత లేనట్లు గుర్తించడంతో యజమాని నుండి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ వివరణ కోరినట్లు అధికారులు తెలిపారు.

అనంతరం మెడికల్ షాపు యాజమాన్యానికి మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించారు. నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

నియమాలు తప్పనిసరి

నియంత్రిత మందుల విక్రయాలపై మెడికల్ షాపులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా నియంత్రిత మందులు విక్రయించవద్దని అధికారులు సూచించారు.

నిషేధంలో ట్రామడాల్ ఘటనలు

సాలూరు పరిసర ప్రాంతాల్లో ట్రామడాల్ ఇంజెక్షన్ల ఖాళీ ప్యాకెట్లు, సిరంజీలు గతంలో పెద్ద సంఖ్యలో కనిపించడం ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలోనే మాదకద్రవ్యాల నియంత్రణపై అధికారులు దృష్టి సారించారు.

Other News
Trending Now
01
EAGLE Press Coverage on 05.10.2026
05 October, 2026
01
EAGLE Press Coverage on 05.10.2026
05 October, 2026
01
EAGLE Press Coverage on 05.10.2026
05 October, 2026
01
EAGLE in News Media Coverage on 04.10.2026
04 October, 2026
Browse by Category
Emergency Helpline
Report drug activity anonymously. Your call protects your community and saves lives.
Call 1972 (Toll-Free)
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.