EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 05 October, 2026
100%
EAGLE
› Enforcement › Operation Vajraprahar – Extensive Cordon and Search Operation Conducted in Eluru Two Town Police Station Limits
Impact Operations
OFFICIAL

Operation Vajraprahar – Extensive Cordon and Search Operation Conducted in Eluru Two Town Police Station Limits

Operation Vajraprahar · Operation Details

Date: 03 October, 2026
GUNTUR
Eluru SDPO
Eluru II Town

Operation Vajraprahar – Extensive Cordon and Search Operation Conducted in Eluru Two Town Police Station Limits

Operation Vajraprahar
Operation Details
Date of Operation
03 October, 2026
District
GUNTUR
Sub-Division
Eluru SDPO
Police Station
Eluru II Town
CASO Area
ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంకపేట మరియు కుమ్మరి రేవు ప్రాంతాలు
Police Personnel Attended
15
Houses Searched
40
Persons Checked / Interacted
150
Vehicles Seized
16 (2-Wheelers)
Detailed Description
తేదీ: 03-10-2026
ఏలూరు.
ఆపరేషన్ వజ్రప్రహార్ భాగముగా ఈగల్ ఐజిపి శ్రీ ఆకే రవి కృష్ణ ఐపిఎస్ మరియు ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ను ఏలూరు 2 టౌన్ పోలీసులు ఈగలు సిబ్బంది నిర్వహించినారు

👉ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంకపేట మరియు కుమ్మరి రేవు ప్రాంతాలను గంజాయి రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏలూరు టూ టౌన్ పోలీసులు మరియు EAGLE డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా విస్తృత కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

👉 ఈ తనిఖీలు ఆయా ప్రాంతాల్లోని అనుమానాస్పద ప్రదేశాలు, వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ వినియోగం, రవాణాను అరికట్టే దిశగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

👉 డాగ్ స్క్వాడ్ మరియు డ్రోన్ సర్వైలెన్స్ సహాయంతో అనుమానాస్పద ప్రాంతాలను కూడా పరిశీలించారు.

👉 ఆపరేషన్‌లో సరైన ధ్రువపత్రాలు లేని 16 వాహనాలను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు.

👉 అదేవిధంగా అనుమానిత 11 మంది వ్యక్తులకు గంజాయి డిటెక్షన్ కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగిటివ్ ఫలితాలు వచ్చాయి.

👉ప్రాంతంలో గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడం, యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచడం మరియు ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

👉 మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని తెలిపారు.

👉 *ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులు మరియు సిబ్బంది ఏలూరు 2 టౌన్ CI శ్రీ K. అశోక్ కుమార్ గారు SI శ్రీ B. మధు వెంకటరాజా గారు SI శ్రీ K. రామకృష్ణ గారు EAGLE RSI శ్రీ ఉదయభాస్కర్ గారు
డాగ్ స్క్వాడ్ బృందం
డ్రోన్ సర్వైలెన్స్ బృందం సుమారు 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు*
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.