Operation Trishool: Kurnool EAGLE Cell and Two Town Police Conduct Drug Tests on 11 Persons at Two Lodgesతేదీ: 14-10-2026
జిల్లా: కర్నూలు
సబ్ డివిజన్: కర్నూలు
PS : 2 టౌన్ PS
స్థలం: లావణ్య లాడ్జ్ మరియు జోగులాంబ లాడ్జి
డ్రగ్ టెస్టులు: 11
ఫలితాలు: నెగిటివ్ (11మందికి)
గౌరవనీయులైన ఈగల్ ఐజీపీ శ్రీ ఆకె రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్ గారి సూచనలతో, ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లావణ్య లాడ్జ్ మరియు జోగులాంబ లాడ్జి లలో
డ్రగ్ టెస్టు డ్రగ్ టెస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఈగల్ SI M. రమేష్ నాయక్ మరియు వారి సిబ్బంది, 2 టౌన్ PS SI శివాంజలి వారి సిబ్బంది తో కలిసి లాడ్జి నందు అనుమానత వ్యక్తులపై Bio-Check డ్రగ్ టెస్ట్ కిట్ల ద్వారా 11 మంది కి పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగిటివ్ ఫలితాలు వచ్చాయి.
ఈ సందర్భంగా ఈగల్ SI గారు మాట్లాడుతూ, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు డ్రగ్ టెస్టుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల ద్వారా మాదకద్రవ్యాల వినియోగాన్ని గుర్తించే అవకాశం ఉందని పేర్కొన్నారు. పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చిన వ్యక్తుల విషయంలో నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైన వారికి డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స మరియు కౌన్సెలింగ్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ముఖ్యంగా యువత గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ విలువైన భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి – ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోండి.