EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Other Verifications (if any)
Field Verification & Monitoring
OFFICIAL

Other Verifications (if any)

Date: 18 October, 2026 Krishna - Gannavaram SDPO - Kankipadu
స్థలం: కంకిపాడు పోలీస్ స్టేషన్, గన్నవరం సబ్ డివిజన్, కృష్ణా జిల్లా.
​కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ‘ఆపరేషన్ త్రిశూల్’ – లో భాగంగా సస్పెక్ట్ షీట్ వ్యక్తులకు ఆకస్మిక డ్రగ్ టెస్టులు 20 మంది నీ టెస్ట్ చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చినది.

​గౌరవనీయులైన ఈగల్ ఐజీపీ శ్రీ ఆకె రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ (ఆపరేషన్స్) శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్, శ్రీ M. రవీంద్ర ఇన్‌స్పెక్టర్ గారి పర్యవేక్షణలో ‘ఆపరేషన్ త్రిశూల్’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
​దీనిలో భాగంగా, కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సస్పెక్ట్ షీట్ వ్యక్తులు మరియు డ్రగ్స్ వినియోగానికి అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది.
​కార్యక్రమ వివరాలు:
​కంకిపాడు ఎస్ఐ గారు, వారి సిబ్బంది మరియు ఈగల్ (EAGLE) సిబ్బంది శ్రీ K. మురళీ మోహన్, శ్రీ ఖాదర్ బాషా సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు.
​ డ్రగ్ టెస్ట్ కిట్‌ల ద్వారా మొత్తం 20 మంది అనుమానితులకు డ్రగ్ టెస్ట్‌లు నిర్వహించారు.
​ఈ పరీక్షల్లో 19 మందికి నెగటివ్ రాగా, ఒక వ్యక్తికి పాజిటివ్ ఫలితం వచ్చినట్లు గుర్తించారు.
​ఈ సందర్భంగా ఈగల్ సిబ్బంది K. మురళీ మోహన్ మాట్లాడుతూ.. గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రగ్ టెస్టుల ద్వారా మాదకద్రవ్యాల వాడకాన్ని త్వరితగతిన గుర్తించే అవకాశం ఉందన్నారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, వారికి డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్ మరియు వైద్య చికిత్స అందిస్తామని స్పష్టం చేశారు. పదేపదే మాదకద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
​యువతకు పిలుపు:
యువత గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, తమ విలువైన భవిష్యత్తును బంగారుమయంగా చేసుకోవాలని కోరారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తామని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
​అత్యవసర సమాచారం కోసం:
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన ఏవైనా సమాచారం తెలిస్తే వెంటనే EAGLE టోల్‌ఫ్రీ నంబర్: 1972 కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.