EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Other Verifications (if any)
Field Verification & Monitoring
OFFICIAL

Other Verifications (if any)

Date: 13 October, 2026 Guntur - North Sub Division - Pedakakani
🦅 గుంటూరు ఈగల్ సెల్ 🦅
📅 తేదీ: 13.10.2026
విషయం: ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా అనుమానిత యువకులకు డ్రగ్ యూరిన్ టెస్ట్‌లు నిర్వహించి కౌన్సెలింగ్ ఇవ్వడం
➡️గౌరవనీయులైన ఈగల్ ఐజీపీ శ్రీ ఆకె. రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్ గారి సూచనలతో, 13.10.2026న గుంటూరు ఈగల్ సెల్ బృందం *ఆపరేషన్ త్రిశూల్* లో భాగంగా గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పెదకాకాని మండలం, నంబూరు గ్రామంలోని నాగార్జున యూనివర్సిటీ సమీప ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది.

➡️ఈ సందర్భంగా గంజాయి వినియోగానికి సంబంధించిన హాట్‌స్పాట్‌ల వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఏడుగురు యువకులకు డ్రగ్ యూరిన్ టెస్ట్‌లు నిర్వహించగా, అందరికీ నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. అనంతరం వారికి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై కౌన్సెలింగ్ నిర్వహించి, భవిష్యత్తులో మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే, మళ్లీ ఇటువంటి హాట్‌స్పాట్‌ల వద్ద అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతూ కనిపించినట్లయితే, చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించి పంపించడం జరిగింది.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.