🦅 గుంటూరు ఈగల్ సెల్🦅
📅తేదీ: 15.10.2026
🎯 విషయం: ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా మత్తు పదార్థాల వినియోగం జరుగుతున్నట్లు సమాచారం అందిన ప్రాంతంలో తనిఖీలు – గుంటూరు ఈగల్ సెల్.
➡️ గౌరవనీయులైన ఈగల్ ఐజీపీ శ్రీ ఆకె రవికృష్ణ ఐపీఎస్ గారి ఆదేశానుసారం, ఈగల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీ మహేశ్వర రాజు ఐపీఎస్ గారి సూచనల మేరకు, ఈరోజు అనగా 15.10.2026వ తేదీన గుంటూరు సౌత్ సబ్ డివిజన్ పరిధిలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధి, తోకవారిపాలెం గ్రామ శివారులో ఉన్న బరియల్ గ్రౌండ్స్ మరియు దాని పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద కొందరు యువకులు మత్తు పదార్థాలు సేవిస్తున్నారనే సమాచారం మేరకు, గుంటూరు ఈగల్ సెల్ ఎస్‌ఐ గారు నల్లపాడు పోలీస్ సిబ్బందితో కలిసి ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా సదరు ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి, పరిసరాలను పరిశీలించడం జరిగింది.
➡️ అనంతరం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించడం జరిగింది. ఎక్కడైనా మాదకద్రవ్యాల వినియోగం లేదా సంబంధిత కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే, వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు తెలియజేయాలని కోరడం జరిగింది. ప్రజలు అందించే సమాచారంపై ఈగల్ మరియు పోలీస్ శాఖల ద్వారా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది.