🦅 గుంటూరు ఈగల్ సెల్ 🦅
🔱 ఆపరేషన్ త్రిశూల్ 🔱
📅 తేదీ: 26-10-2026
📍 జిల్లా: గుంటూరు
🔹 సబ్ డివిజన్: గుంటూరు నార్త్
🔹 పోలీస్ స్టేషన్: పెదకాకాని
🔹 ప్రాంతం: బసవతారక నగర్
🔹 ఫలితం: ఒకరికి డ్రగ్ టెస్ట్ పాజిటివ్
🚨 ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా గంజాయి హాట్‌స్పాట్లపై ఈగల్ నిఘా
🔱 ఆకస్మిక తనిఖీల్లో ఒకరికి డ్రగ్ టెస్ట్ పాజిటివ్ – తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలింపు
🔹ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ శ్రీ ఆకే. రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్ గారు మరియు ఎస్పీ (అడ్మిన్) శ్రీమతి స్వరూప రాణి గారి సూచనలతో గుంటూరు ఈగల్ సెల్ ఆధ్వర్యంలో ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు గంజాయి వినియోగం మరియు విక్రయాలకు సంబంధించి అందిన సమాచారం మేరకు, గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని బసవతారక నగర్ 3వ లైన్, హనుమంతు హాస్పిటల్ ఎదురుగా ఉన్న ప్రాంతంతో పాటు, 76వ వార్డు రైల్వే క్వార్టర్స్ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ టవర్ వెనుక భాగంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఈగల్ సెల్ అధికారులు దృష్టి సారించారు.
🔹 ఈ సమాచారంతో గుంటూరు ఈగల్ సెల్ ఎస్సై శ్రీ ఎం. సునీల్ బాబు గారు, ఎస్సై శ్రీ రాజశేఖర్ గారు మరియు మరియు పెద్దకాకాని ఎస్సై గారు మరియు సిబ్బంది ఈగల్ సిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాల్లో గంజాయి హాట్‌స్పాట్లను గుర్తించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
🔹 ఈ తనిఖీల్లో భాగంగా అనుమానితులకు డ్రగ్ టెస్టులు నిర్వహించగా, ఒక వ్యక్తికి డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ ఫలితం వచ్చినది. సదరు వ్యక్తిని తదుపరి విచారణ నిమిత్తం పెదకాకాని పోలీస్ స్టేషన్‌కు తరలించడం జరిగినది.
🔹 గంజాయి విక్రయాలు, సరఫరా మరియు వినియోగానికి సంబంధించిన సమాచారంపై విచారణ కొనసాగుతుందని, గుర్తించిన హాట్‌స్పాట్లపై నిరంతర నిఘా కొనసాగిస్తామని ఈగల్ సెల్ అధికారులు తెలిపారు.