EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Other Verifications (if any)
Field Verification & Monitoring
OFFICIAL

Other Verifications (if any)

Date: 13 October, 2026 Alluri Sitharama Raju - Chintapalli SDPO - Chinthapalli
ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా డ్రగ్ టెస్టులు

తేదీ: 13-10-2026
జిల్లా: ASR
సబ్ డివిజన్: చింతపల్లి
PS : కొయ్యురు
స్థలం: డౌనూరు చెక్ పోస్ట్
డ్రగ్ టెస్టులు: 05
ఫలితాలు: నెగిటివ్ (05 మందికి)

గౌరవనీయులైన ఈగల్ ఐజీపీ శ్రీ ఆకె రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్ గారి సూచనలతో, విశాఖపట్నం ఈగల్ రీజినల్ ఆఫీసర్ శ్రీ Ch. Srinivasa Rao, అడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం, ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా కొయ్యిరు పోలీస్ స్టేషన్ పరిధిలోని డౌనూరు చెక్ పోస్ట్ వద్ద డ్రగ్ టెస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఈగల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ S. నారాయణరావు గారు మరియు వారి సిబ్బంది, చెక్ పోస్ట్ SI వారి సిబ్బంది తో కలిసి వాహనాలు తగ్గించేస్తూ అనుమానత వ్యక్తులపై Bio-Check డ్రగ్ టెస్ట్ కిట్ల ద్వారా 05మంది పై పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగిటివ్ ఫలితాలు వచ్చాయి.

ఈ సందర్భంగా ఈగల్ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు డ్రగ్ టెస్టుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల ద్వారా మాదకద్రవ్యాల వినియోగాన్ని గుర్తించే అవకాశం ఉందని పేర్కొన్నారు. పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చిన వ్యక్తుల విషయంలో నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైన వారికి డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స మరియు కౌన్సెలింగ్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ముఖ్యంగా యువత గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ విలువైన భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి – ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోండి.
నమస్కారం సార్
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.