EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Operation Garuda
Impact Operations
OFFICIAL

Operation Garuda

Date: 13 October, 2026 Visakhapatnam Commissionerate - DCP L&O-I - Anandapuram
విశాఖపట్నం -ఈగల్ సెల్
ఆపరేషన్ గరుడలో భాగంగా మెడికేర్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్‌లో సంయుక్త తనిఖీలు – గడువు ముగిసిన మందులు గుర్తింపు
👉ఈ రోజు, 13.10.2026న, ఆపరేషన్ గరుడలో భాగంగా విశాఖపట్నం నగరంలోని అక్కయ్యపాలెం మెయిన్ రోడ్డులో ఉన్న *మెడికేర్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ (హోల్‌సేల్ NRx మెడిసిన్స్ షాప్)లో విశాఖపట్నం డ్రగ్స్ కంట్రోల్ శాఖ, *నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) మరియు విశాఖపట్నం EAGLE బృందాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
👉 ఈ తనిఖీల్లో విశాఖపట్నం EAGLE రీజినల్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీ శ్రీ Ch. Srinivasa Rao, EAGLE ఇన్‌స్పెక్టర్ డా. T. Kalyani, NCB ఇన్‌స్పెక్టర్ శ్రీ Kiran Babu మరియు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీమతి V. Abhi Priya పాల్గొన్నారు. తనిఖీల సందర్భంగా పలు లోపాలు గుర్తించబడ్డాయి. 👉ఈ తనిఖీల్లో
1. గడువు ముగిసిన రుమార్ఫ్ ఇంజెక్షన్ల గుర్తింపు:
షాపులో విక్రయించదగిన ఇతర మందులతో పాటు గడువు ముగిసిన రుమార్ఫ్ ఇంజెక్షన్ల నిల్వ ఉన్నట్లు గుర్తించారు.
మందు పేరు: Rumorf Injection
బలం: 15 మి.గ్రా./మి.లీ.
పరిమాణం: 170 ఆంప్యూల్స్
బ్యాచ్ నంబర్: 839922803
గడువు ముగిసిన తేదీ: జూన్ 2025.
👉2. NDPS మందుల స్టాక్ రిజిస్టర్‌లో నమోదు లోపాలు:
NDPS మందుల స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించగా, 03.10.2026న జారీ చేసిన ఇన్వాయిస్ నంబర్ MPN0077, అలాగే 07.10.2026న జారీ చేసిన ఇన్వాయిస్ నంబర్ MPN0078 ద్వారా జారీ చేసిన NDPS మందుల వివరాలను లైసెన్సుదారుడు స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేయలేదని గుర్తించారు. 👉3. గడువు ముగిసిన ఫెంట్ ఇంజెక్షన్ల గుర్తింపు:
లైసెన్సుదారుడు ప్రత్యేకంగా నిల్వ ఉంచిన గడువు ముగిసిన ఫెంట్ ఇంజెక్షన్లను కూడా గుర్తించారు.
👉 Fent Injection
బ్యాచ్ నంబర్: 36416
గడువు ముగిసిన తేదీ: ఫిబ్రవరి 2020
పరిమాణం: 530 ఆంప్యూల్స్
గడువు ముగిసిన మందులను ఇంతకాలం ఎందుకు తొలగించలేదో వివరణ సమర్పించాలని లైసెన్సుదారుని ఆదేశించారు.
👉 ఈ సందర్భంగా విశాఖపట్నం EAGLE రీజినల్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీ శ్రీ Ch. Srinivasa Rao మాట్లాడుతూ, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా లేదా అవసరానికి మించి NRx మందులను విక్రయించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
👉 NRx మందుల విక్రయాలు సంబంధిత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా మాత్రమే జరగాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే మెడికల్ షాపులను గుర్తించి, బాధ్యులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
👉ఈ ఆపరేషన్ గరుడ సంయుక్త తనిఖీల్లో విశాఖపట్నం EAGLE సిబ్బంది మరియు NCB సిబ్బంది పాల్గొన్నారు.
🦅 విశాఖపట్నం- ఈగల్ సెల్🦅
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.