🦅 ఈగల్ సెల్ పల్నాడు 🦅
📅 15.10.2026
🚨విషయం: *ఆపరేషన్ గరుడ లో భాగంగా పల్నాడు జిల్లా లోని నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో ఈగల్ సెల్ మరియు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్తంగా నరసరావుపేట I టౌన్ అండ్ II టౌన్ PS పరిధిలోని 4 మెడికల్ షాపులలో ( వాహిని, సువిధ, చిన్మాయీ, శ్రీ వసంత (II town) తనిఖీలు నిర్వహించడం అయినది
➡️ గౌరవనీయులైన ఈగల్ ఐజీపీ శ్రీ ఆకె రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్ గారి సూచనలతో 15.10.2026వ తేదీన పల్నాడు ఈగల్ సెల్ మరియు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, నరసరావుపేట అధికారులు సంయుక్తంగా మెడికల్ షాపులను తనిఖీ చేయడం జరిగింది.
➡️ ఈ తనిఖీలలో భాగంగా మెడికల్ షాపులలో నిర్వహిస్తున్న పర్చేజ్ రిజిస్టర్లు, ఎన్‌ఆర్‌ఎక్స్ (NRx) రిజిస్టర్లను పరిశీలించి, ఔషధాల కొనుగోళ్లు, విక్రయాలకు సంబంధించిన వివరాలను నిబంధనల ప్రకారం సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా అనే అంశాలను తనిఖీ చేయడం జరిగింది.
➡️ మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఔషధాల విక్రయాలపై పర్యవేక్షణ పెంచడం మరియు సంబంధిత నిబంధనలను అమలు చేయడం లక్ష్యంగా ఈ సంయుక్త తనిఖీలు నిర్వహించబడ్డాయి.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించటమైనది.