EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Operation Garuda
Impact Operations
OFFICIAL

Operation Garuda

Date: 14 October, 2026 Eluru - Eluru SDPO - Eluru I Town
ఏలూరు ఈగల్ సెల్,
తేదీ:14/10/2026
ఆపరేషన్ గరుడ,
ఏలూరు వన్ టౌన్ పీస్ పరిధి.

ఆపరేషన్ గరుడ – ఏలూరులో మెడికల్ షాపులపై సంయుక్త తనిఖీలు.

👉ఈ రోజు అనగా 14-10-2026న, డిప్యూటీ డైరెక్టర్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏలూరు వారి పర్యవేక్షణలో, EAGLE డిపార్ట్‌మెంట్ మరియు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు సంయుక్తంగా ఏలూరు నగరంలో nRx ఔషధాల కొనుగోలు, విక్రయ రికార్డులను తనిఖీ చేయడం జరిగింది.

👉ఈ తనిఖీలలో క్రింది మెడికల్ షాపులలో ది డ్రగ్స్ రూల్స్, 1945 నిబంధనల ఉల్లంఘనలు గుర్తించడం జరిగింది.

1. శ్రీ శ్రీకాంత్ మెడికల్స్ (Sri Srikanth Medicals)
స్థలం: స్వరూప్ క్లినిక్ ప్రాంగణం, ఏలూరు

ఉల్లంఘించిన నిబంధనలు: డ్రగ్స్ రూల్స్, 1945లోని రూల్స్ 65(2), 65(4)(3), 65(4)(4), 65(3)(1), 65(3)(1)(h) మరియు 65(4)(1).

2. మెడికేర్ ఫార్మసీ (Medicare Pharmacy), ఏలూరు

ఉల్లంఘించిన నిబంధనలు: డ్రగ్స్ రూల్స్, 1945లోని రూల్స్ 65(2), 65(9)(a), 65(4)(3), 65(4)(4), 65(3)(1), 65(3)(1)(h) మరియు 65(4)(1).

👉ఈ తనిఖీలలో ప్రధానంగా H1 రిజిస్టర్ల నిర్వహణ, nRx ఔషధాల విక్రయాలకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్ల నమోదు, కొనుగోలు మరియు విక్రయ రికార్డుల నిర్వహణకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలు గుర్తించడం జరిగింది.

👉సదరు ఉల్లంఘనలకు సంబంధించి, వర్తించే చట్ట నిబంధనల ప్రకారం తగిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత మెడికల్ షాపులపై ప్రొసీడింగ్స్ నిర్వహించడం జరిగింది.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.